భారత్‌ vs వెస్టిండీస్‌ మధ్య వందో వార్‌..

by Vinod kumar |
భారత్‌ vs వెస్టిండీస్‌ మధ్య వందో వార్‌..
X

దిశ, వెబ్‌డెస్క్: వందో వార్‌ భారత్‌, వెస్టిండీస్‌ చరిత్రాత్మక పోరుకు సిద్ధమయ్యాయి. పోర్ట్‌ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా ఇరు జట్ల మధ్య వందో టెస్టు మ్యాచ్‌ సమరం జరుగనుంది. 1948లో ఇరు జట్ల మధ్య మొదలైన టెస్టు పోరు 2023 నాటికి వందో మ్యాచ్‌కు చేరుకుంది. ప్రతిష్ఠాత్మక పోరులో గెలిచి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని టీమ్‌ఇండియా ఉత్సాహంతో ఉంది. మరోవైపు ఇప్పటికే ఘోర ఓటమి చవిచూసిన విండీస్‌ సొంత గడ్డపై కనీసం పరువైనా నిలుపుకోవాలని పట్టుదలతో ఉంది.

దీంతో రెండు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశముంది. 100 భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య ఇది వందో టెస్టు పోరు. ఇప్పటి వరకు భారత్‌ 23 టెస్టులో గెలువగా, విండీస్‌ 30 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 46 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. అంతర్జాతీయ కెరీర్‌లో 500 మ్యాచ్‌ ఆడబోతున్న కోహ్లీపైనే అందరి దృష్టి నెలకొంది. విండీస్‌తో తొలి టెస్టులో అర్ధసెంచరీతో ఆకట్టుకున్న కోహ్లీ.. ఈసారైనా రాణించాలన్న పట్టుదలతో ఉన్నాడు. మరోవైపు యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ అరంగేట్రం మ్యాచ్‌లోనే భారీ సెంచరీతో అదరగొట్టాడు. ఇదే జోరును కొనసాగిస్తూ రెండో టెస్టులోనూ జైస్వాల్‌ చెలరేగితే టీమ్‌ఇండియా ఖాతాలో మరో విజయం చేరినట్లే.

భారత జట్టు:

యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్(w), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, రుతురాజ్ గైక్వాడ్, శ్రీకర్ భరత్, నవదీప్, అక్సర్ పటేల్, అక్సర్ పటేల్

వెస్టిండీస్ జట్టు:

క్రైగ్ బ్రాత్‌వైట్ (సి), టాగెనరైన్ చందర్‌పాల్, జెర్మైన్ బ్లాక్‌వుడ్, అలిక్ అథానాజ్, జాషువా డా సిల్వా (w), జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, రహ్కీమ్ కార్న్‌వాల్, కెమర్ రోచ్, జోమెల్ వారికన్, షానన్ గాబ్రియెర్, కిర్క్ మెకెంజీ, కెవిన్ సింక్లైర్

Advertisement

Next Story

Most Viewed