ఇండియా - ఇంగ్లాండ్ సిరీస్‌పై ఎవరేమన్నారు.. బద్దలైన రికార్డులేంటి?

by John Kora |
ఇండియా - ఇంగ్లాండ్ సిరీస్‌పై ఎవరేమన్నారు.. బద్దలైన రికార్డులేంటి?
X

దిశ, స్పోర్ట్స్:


రోహిత్ శర్మ, టీమ్ ఇండియా కెప్టెన్:
ఈ సిరీస్ చాలా ప్రశాంతంగా సాగిపోయింది. కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుందని మాకు తెలుసు. కానీ అలాంటివి ఏవీ ఎదురు కాలేదు. ఇక నేను అవుటైన విధానంపై బాధ ఏమీ లేదు. ఆ క్రెడిట్ అంతా బౌలర్‌దే. మేం కొన్ని అంశాలను మెరుగుపరుచుకోవల్సి ఉంది. అయితే మా జట్టులో ఎలాంటి లోపాలు అయితే కనపడలేదు. మా ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఉంది. వాళ్లు గ్రౌండ్‌లోకి అడుగుపెట్టిన తర్వాత తమదైన రీతిలో ఆడారు. ఇదే విధమైన ఫామ్‌ను కంటిన్యూ చేయాలని భావిస్తున్నాము.

శుభ్‌మన్ గిల్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ : ఈ ఫార్మాట్‌లో తాను ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇదే అని భావిస్తాను. పిచ్ మొదట్లో చాలా ట్రిక్కీగా ఉంది. కానీ ఆ తర్వాత అర్థం చేసుకొని ఆడాను. సీమర్లకు పిచ్ సహకరిస్తుండటంతో నేను విరాట్ కోహ్లీతో మాట్లాడాను. ఆ తర్వాత స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఆడాము. పవర్ ప్లేలో మరో వికెట్ పడకూడదని మేం భావించి.. అదే విధంగా బ్యాటింగ్ చేశాం.

జాస్ బట్లర్, ఇంగ్లాండ్ కెప్టెన్ : ఈ టూర్ అంతా వైఫల్యాలతోనే సరిపోయింది. మా బ్యాటింగ్ సరిగా లేదు. దూకుడుగా బ్యాటింగ్ చేయాలన్న మా ఆలోచన సరైనదే. కానీ చివరి వరకు పూర్తిగా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాము. శుభమన్ గిల్ అద్బుతంగా బ్యాటింగ్ చేశాడు.

ఇంగ్లాండ్‌పై పరుగుల పరంగా భారత్ భారీ విజయాలు

158 పరుగులు - 2008, రాజ్‌కోట్

142 పరుగులు - 2025, అహ్మదాబాద్

133 పరుగులు - 2014, కార్డిఫ్

127 పరుగులు - 2013, కోచి

126 పరుగులు - 2011, హైదరాబాద్

అహ్మదాబాద్‌లో అత్యధిక పరుగులు

ఇండియాపై సౌతాఫ్రికా 365/2 - 2010

ఇంగ్లాండ్‌పై ఇండియా 356/10 - 2025

వెస్టిండీస్‌పై ఇండియా 325/5 - 2002

ఇండియాపై వెస్టిండీస్ 324/4 - 2002

ఇండియాపై పాకిస్తాన్ 319/7 2007

Advertisement
Next Story