- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోహిత్ సేన హ్యాట్రిక్ కొట్టేనా?.. రాంచీలో సిరీస్ దక్కుతుందా?
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో టీమ్ ఇండియా కీలక పోరుకు సిద్ధమైంది. ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్ సిరీస్‌పై కన్నేసింది. రేపటి నుంచి రాంచీ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభకానుంది. వరుసగా రెండో విజయాలతో జోరు మీద ఉన్న రోహిత్ సేన మరో మ్యాచ్ మిగిలి ఉండగానే రాంచీలో సిరీస్ పట్టేయాలనుకుంటున్నది. బ్యాటింగ్ లైనప్‌పై ఉన్న అనుమానాలు రాజ్‌కోట్ టెస్టుతో పటాపంచలయ్యాయి. యశస్వి జైశ్వాల్ భీకర ఫామ్‌లో ఉండగా.. రోహిత్, గిల్ టచ్‌లోకి వచ్చారు. మరోవైపు, సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రంలోనే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లోనూ అతను సత్తాచాటితే జట్టులో చోటు పదిలమే. జడేజా ఆల్‌రౌండ్ షో జట్టుకు ప్రధాన బలాల్లో ఒక్కటి. ఇక, రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్ ప్రదర్శన ఆందోళనకరంగా ఉంది. ఈ మ్యాచ్‌లో వీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్ పరంగా టీమ్ ఇండియా బలంగానే కనిపిస్తున్నా ఇంగ్లాండ్‌ను ఏమాత్రం తేలికగా తీసుకోవడానికి లేదు. గత మ్యాచ్‌ల్లోలాగానే స్కోరు బోర్డుపై భారీ పరుగులు పెట్టాల్సిందే. ఇక, జడేజా, అశ్విన్, కుల్దీప్ స్పిన్ త్రయం మంచి ఫామ్‌లో ఉంది. బ్యాటింగ్ సామర్థ్యం కావాలనుకుంటే కుల్దీప్‌ను తప్పించి అక్షర్ పటేల్‌ను తీసుకోవచ్చు. నలుగురు స్పిన్నర్లను తీసుకుంటే వీరిద్దరికి చోటు ఖాయమే. బుమ్రా గైర్హాజరులో సిరాజ్ పేస్ దళాన్ని నడిపించనుండగా.. మరో పేసర్ స్థానం కోసం ముకేశ్ కుమార్, అకాశ్ దీప్ పోటీపడుతున్నారు. వీరిలో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి.
బజ్‌బాల్‌ను ఇంగ్లాండ్ పక్కనపెడుతుందా?
గత రెండు మ్యాచ్‌ల్లో బజ్‌బాల్ ఆటతో ఇంగ్లాండ్ దెబ్బతిన్నది. నెమ్మదిగా ఆడాల్సిన పరిస్థితుల్లో దూకుడుకు పోయి బోల్తా పడింది. మరి, సిరీస్‌లో నిలువాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బజ్‌బాల్‌ను పక్కనపెట్టి పరిస్థితులకు తగ్గట్టు ఆడుతుందో లేదో చూడాలి. నాలుగో టెస్టుకు ఇంగ్లాండ్ తమ తుది జట్టును గురువారమే ప్రకటించింది. బ్యాటింగ్ లైనప్‌లో ఏ మార్పులు చేయకపోయినా.. బౌలింగ్‌లో దళంలో మాత్రం రెండు మార్పులు చేసింది. మార్క్‌వుడ్ స్థానంలో ఓలీ రాబిన్సన్, రెహాన్ అహ్మద్ స్థానంలో షోయబ్ బషీర్‌లను తుది జట్టులోకి తీసుకుంది. గత మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేయని కెప్టెన్ బెన్‌స్టోక్స్ ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేసే చాన్స్ ఉంది.
పిచ్ రిపోర్టు
రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియం పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అలాగే, ఈ పిచ్‌పై స్పిన్నర్లకు అనుకూలించనుంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. మ్యాచ్ ప్రారంభంలో పరుగులు సాధించడానికి పిచ్ అనుకూలంగా ఉండటమే అందుకు కారణమని నివేదికలు చెబుతున్నాయి. ఇక్కడ 2019లో సౌతాఫ్రికాతో ఆడిన చివరి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2017లో ఆస్ట్రేలియాతో ఆడిన టెస్టును డ్రాగా ముగించింది.
తుది జట్లు
భారత్(అంచనా) : రోహిత్(కెప్టెన్), యశస్వి జైశ్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అశ్విన్, కుల్దీప్ యాదవ్/అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్/ఆకాశ్ దీప్.
ఇంగ్లాండ్ : జాక్ క్రాలీ, బెన్ డక్కెట్, ఓలీ పోప్, జోరూట్, బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, ఓలీ రాబిన్సన్, జేమ్స్ అండర్సన్, షోయబ్ బషీర్.