- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐసీసీ అదాయంలో బీసీసీఐకి సింహ భాగం.. కొత్త రెవెన్యూ షేరింగ్ విధానం!
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2024-2027కు కొత్త రెవెన్యూ షేరింగ్ మోడల్‌ను పరిశీలిస్తోంది. దీని ద్వారా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఐసీసీ ఆదాయంలో సింహ భాగం లభించనుంది. అంటే మునుపు ఉన్న 22.8 శాతం ఆదాయం కొత్త రెవెన్యూ షేరింగ్ వల్ల 37 శాతానికి పెరుగుతుంది. ప్రపంచంలోని అన్ని క్రికెట్ బోర్డుల కంటే కూడా ఐసీసీకి 75 శాతం ఆదాయం బీసీసీఐ నుంచి లభిస్తోంది. అయితే రానున్న రోజుల్లో మీడియా హక్కుల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం చూస్తుంటే.. గతంలో కంటే భారత బోర్డు షేరింగ్ మరింత పెరిగే అవకాశముంది.
భారత మార్కెట్ ఒక్కటే 3.04 బిలియన్ల ఆదాయాన్ని అందిస్తోంది. ఇది ఐసీసీ మొత్తం ఆదాయంలో దాదాపు 88 నుంచి 90 శాతం. మరోవైపు ప్రపంచ కప్ ప్రసార ఆదాయం నుంచి రూ. 955 కోట్ల (127 మిలియన్ డాలర్లు) పన్ను సర్‌చార్జిని మినహాయించాలని ఐసీసీని బీసీసీఐ కోరనున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది 2024-2024 కొత్త రెవెన్యూ షేరింగ్ ద్వారా భర్తీ అవతుందని భారత బోర్డు అధికారులు భావిస్తున్నారు.
Also Read..