బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

by Mahesh |
బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత్ కేవలం శ్రీలంక టూర్‌లో పాల్గొంది. అది కూడా కేవలం టీ20, వన్డే కప్‌లను ఆడింది. అయితే తాజాగా భరత జట్టు బంగ్లాదేశ్‌ జట్టుతో టెస్ట్ సిరీస్ కు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 20 నుంచి మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుండగా.. ఈ టెస్ట్ సిరీస్ ఆడే జట్టును బీసీసీఐ ఆదివారం సాయంత్రం ప్రకటించింది. ఈ IDFC FIRST బ్యాంక్ మొదటి టెస్ట్ మ్యాచుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వ్యవహరించనున్నాడు. అలాగే బంగ్లా జట్టుకు బ్యాటర్లుగా రోహిత్ శర్మ (సి), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (WK), ధృవ్ జురెల్ (WK)లను ఎంపిక చేయగా ఆల్ రౌండర్లుగా ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, అక్షర్ పటేల్ లకు చోటు దక్కింది. అలాగే బౌలర్లుగా.. కుల్దీప్ యాదవ్, మహమ్మద్. సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్ లకు చోటు దక్కింది. కాగా ఈ టెస్ సిరీస్‌కు మొత్తం 15 మంది ప్లేయర్లతో జట్టును ప్రకటించారు.

Advertisement

Next Story