అశ్విన్ స్థానంలో పడిక్కల్.. కండిషన్స్ అప్లయ్!

by Swamyn |
అశ్విన్ స్థానంలో పడిక్కల్.. కండిషన్స్ అప్లయ్!
X

దిశ, స్పోర్ట్స్: టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకున్న అశ్విన్.. మూడో టెస్టు నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన విషయం తెలిసిందే. అతని కుటుంబంలో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా జట్టు నుంచి వైదొలిగినట్టు బీసీసీఐ శుక్రవారమే వెల్లడించింది. దీంతో మూడో రోజైన శనివారం అశ్విన్ స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్‌ ఫీల్డింగ్ చేశాడు. నిబంధనల ప్రకారం ఒక ప్లేయర్‌ మైదానంలో గాయపడి మ్యాచ్‌ మొత్తానికి దూరమైతే అంపైర్ అనుమతితో అతడి స్థానంలో మరో ప్లేయర్‌ను కంకషన్‌గా తీసుకోవచ్చు. అలా వచ్చిన ప్లేయర్‌తో ఫీల్డింగ్‌తోపాటు బ్యాటింగ్, బౌలింగ్ కూడా చేయించొచ్చు. కానీ, అశ్విన్‌ అలా వెళ్లలేదు. ఆమోదించదగిన కారణంతోనే వెళ్లినప్పటికీ అతని స్థానంలో వచ్చే ఆటగాడు మాత్రం బ్యాటింగ్, బౌలింగ్‌కు చేయడానికి వీల్లేదు. గాయపడటం, అనారోగ్యానికి గురవడం, లేదా ఇంకేదైన ఆమోదయోగ్యమైన కారణంతో ఆట నుంచి వైదొలిగితే సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ను తీసుకునేందుకు అంపైర్‌ అనుమతినిస్తాడు. ఆ ప్లేయర్ ఫీల్డింగ్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో అంపైర్ల అనుమతితో వికెట్‌ కీపింగ్‌ కూడా చేయొచ్చు.


Advertisement

Next Story