హాకీ ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఖరారు

by Harish |
హాకీ ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఖరారు
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం కైవసం చేసుకున్న భారత పురుషుల హాకీ జట్టు ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీపై దృష్టి పెట్టింది. చైనా వేదికగా సెప్టెంబర్ 8 నుంచి 17 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీకి హాకీ ఇండియా బుధవారం 18 మందితో కూడిన జట్టును ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. మిడ్ ఫీల్డర్ వివేక్ సాగర్ ప్రసాద్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అలాగే, గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో క్రిషన్ బహదూర్ పాఠక్, సూరజ్ కర్కెరా గోల్ కీపర్లుగా ఎంపికయ్యారు.

పారిస్ ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన జట్టు నుంచి 10 మందిని సెలెక్ట్ చేశారు. హార్దిక్ సింగ్, మన్‌దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ, శంషేర్ సింగ్, గుర్జాంత్ సింగ్‌కు విశ్రాంతినిచ్చారు. గుర్జోత్ సింగ్‌కు తొలిసారిగా జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు తిరుగులేని రికార్డు ఉంది. ఏడు ఎడిషన్లలో నాలుగుసార్లు(2011, 2016, 2018, 2023) చాంపియన్‌గా నిలిచింది. 2018లో పాకిస్తాన్‌తో కలిసి టైటిల్ పంచుకుంది. డిపెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న హర్మన్‌ప్రీత్ సేన టైటిల్ నిలబెట్టుకోవడంపై కన్నేసింది. ఈ టోర్నీలో భారత్‌తో సహా సౌత్ కొరియా, మలేషియా, పాకిస్తాన్, జపాన్, చైనా జట్లు పాల్గొంటున్నాయి. సెప్టెంబర్ 8న భారత జట్టు తొలి మ్యాచ్‌లో చైనాతో తలపడనుంది. సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో ఆడనుంది.

భారత పురుషుల హాకీ జట్టు

గోల్‌కీపర్స్ : క్రిషన్ బహదూర్ పాఠక్, సురాజ్ కర్కెరా, డిఫెండర్స్ : జర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, హర్మన్‌ప్రీత్ సింగ్(కెప్టెన్), జుగ్‌రాజ్ సింగ్, సంజయ్, సుమితి, మిడ్‌ఫీల్డర్స్ : రాజ్ కుమార్ పాల్, నిలకంఠ శర్మ, వివేక్ సాగర్, మన్‌ప్రీత్ సింగ్, మహమ్మద్ రహీల్ మౌసిన్, ఫార్వార్డ్స్ : అభిషేక్, సుఖ్‌జీత్ సింగ్, అరైజీత్ సింగ్, ఉత్తమ్ సింగ్, గుర్జోత్ సింగ్.

Advertisement

Next Story

Most Viewed