IND VS SL : క్వీన్‌స్వీప్‌పై టీమిండియా కన్ను.. నేడు శ్రీలంకతో మూడో టీ20

by Harish |
IND VS SL : క్వీన్‌స్వీప్‌పై టీమిండియా కన్ను.. నేడు శ్రీలంకతో మూడో టీ20
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 కెప్టెన్ సూర్యకుమార్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తమ తొలి పర్యటనలో విజయవంతమయ్యారు. శ్రీలంక టూరులో టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్‌ను దక్కించుకుంది. వరుసగా రెండు విజయాలతో జోష్ మీద ఉన్న భారత జట్టు సిరీస్ వైట్‌వాష్‌పై కన్నేసింది. నేడు ఇరు జట్లు ఆఖరిదైనా మూడో టీ20లో తలపడబోతున్నాయి. ఆ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని సూర్య జట్టు ఉవ్విళ్లూరుతుండగా.. ఆఖరి మ్యాచ్‌లోనైనా నెగ్గి పరువు కాపాడుకోవాలని శ్రీలంక జట్టు భావిస్తున్నది.

వరుసగా తొలి రెండు విజయాలతో భారత జట్టు ఆత్మవిశ్వాసంతో ఉన్నది. అందుకుతోడు బ్యాటింగ్‌లో జైశ్వాల్, సూర్యకుమార్, పంత్, పాండ్యా మంచి ఫామ్‌లో ఉన్నారు. అలాగే, బౌలింగ్ పరంగా అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ రాణిస్తున్నారు. రెండు మ్యాచ్‌ల్లో వీరు రెండేసి చొప్పున వికట్లు పడగొట్టారు. రవి బిష్ణోయ్ కూడా టచ్‌లో ఉన్నాడు. అయితే, మూడో టీ20 కోసం తుది జట్టులో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. గిల్ గాయపడటంతో రెండో టీ20 ఆడిన సంజూ శాంసన్ ఆ మ్యాచ్‌లో డకౌటై నిరాశపరిచాడు. అయితే, టీమ్ మేనేజ్‌మెంట్ అతనికి మరో అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అలాగే, రియాన్ పరాగ్ బ్యాటుతో అస్సలు రాణించలేదు. అతని స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు చోటు దక్కే చాన్స్ ఉంది. అలాగే, రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన పేసర్ ఖలీల్ అహ్మద్‌ను మూడో టీ20లో జట్టులోకి తీసుకోవచ్చు. అతనికి చోటు ఇవ్వాలంటే సిరాజ్ లేదా అర్ష్‌దీప్‌లలో ఒక్కరిని పెక్కనపెట్టాల్సి ఉంటుంది. మరి, ఎవరిని తప్పిస్తారో చూడాలి. మరోవైపు, శ్రీలంక జట్టు మిడిలార్డర్ సమస్యను ఎదుర్కొంటుంది. ఓపెనర్లు నిశాంక, కుసాల్ మెండిస్, కుసాల్ పెరీరాలపైనే ఆ జట్టు బ్యాటింగ్ దళం ఆధారపడి ఉన్నది. బౌలర్లలో పతిరణ నుంచి భారత బ్యాటర్లకు సవాల్ తప్పదు.

తుది జట్లు(అంచనా)

భారత్ : జైశ్వాల్, శాంసన్, సూర్యకుమార్(కెప్టెన్), పంత్, రియాన్ పరాగ్/సుందర్, పాండ్యా, రింకు, అక్షర్, రవి బిష్ణోయ్, సిరాజ్, అర్ష్‌దీప్/ఖలీల్ అహ్మద్

శ్రీలంక : నిశాంక, కుసాల్ మెండిస్, కుసాల్ పెరీరా, కామిందు మెండిస్, అసలంక(కెప్టెన్), దినేశ్ చండిమాల్/అవిష్క ఫెర్నాండో, హసరంగ, రమేశ్ మెండిస్, తీక్షణ, పతిరణ, అసిత పెర్నాండో.

Advertisement

Next Story