- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెట్ సెషన్‌లోనే గంభీర్ ఉద్దేశం ఏంటో తెలిసింది.. గిల్ కీలక వ్యాఖ్యలు
దిశ, స్పోర్ట్స్ : టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉద్దేశం, కమ్యూనికేషన్ స్పష్టంగా ఉందని భారత జట్టు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ముందు పల్లెకెలెలో గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో గిల్.. గంభీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘మేము వరల్డ్ చాంపియన్స్. ఈ సిరీస్‌లోనూ అలాగే ఆడతాం. కొత్త కోచింగ్ స్టాఫ్ ఆధ్వర్యంలో మరింత విజయవంతమవుతామని ఆశిస్తున్నా. గంభీర్‌తో కలిసి పని చేయడం ఇదే తొలిసారి. రెండు నెట్ సెషన్లలోనే అతని ఉద్దేశం, కమ్యూనికేషన్ స్పష్టంగా తెలిశాయి. ఎలాంటి ఆటగాడితో పనిచేయాలనుకుంటున్నాడో అనే దానిపై అతనికి స్పష్టత ఉంది.’అని చెప్పాడు.
అలాగే, మూడు ఫార్మాట్లలో నిలకడగా ఆడగలిగే ప్లేయర్‌గా మారడంపై దృష్టి పెట్టినట్టు తెలిపాడు. ‘టీ20 వరల్డ్ కప్‌కు ముందు నా స్థాయి ప్రదర్శన చేయలేదు. వచ్చే సర్కిల్ మేము 30-40 టీ20లు ఆడబోతున్నాం. బ్యాటర్‌గా నా ప్రదర్శన మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తా. ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ కోసం ఎదురుచూస్తున్నా. ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీ. అంతకుముందు శ్రీలంకతో మాకు ఈ ఆరు మ్యాచ్‌లు కీలకమైనవి.’ అని చెప్పుకొచ్చాడు. అలాగే, వైస్ కెప్టెన్సీ తనపై ఎలాంటి ఒత్తిడికి గురి చేయదన్నాడు. గంభీర్, సూర్యకుమార్ జట్టు పట్ల ఒకే ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నారని చెప్పాడు.