రెండో టెస్టులోనైనా గెలుస్తారా?

by Swamyn |
రెండో టెస్టులోనైనా గెలుస్తారా?
X

దిశ, స్పోర్ట్స్ : తొలి టెస్టులో టీమ్ ఇండియా ఘోర వైఫల్యం చెందింది. ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా.. ఈ పర్యటనలోనూ సౌతాఫ్రికా గడ్డపై చారిత్రాత్మక సిరీస్ విజయం కలగానే మిగిలిపోయింది. రెండు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0తో ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో.. భారత్ పోరాటం ఇక డ్రా కోసమే. నేడు చివరిదైనా రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ కీలక పోరుకు కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ స్టేడియం వేదిక. మరి, రెండో టెస్టులోనైనా టీమ్ ఇండియా సత్తాచాటి సిరీస్ సమం చేస్తుందా? లేదంటే మరోమారు తేలిపోయి సిరీస్ సమర్పించుకుంటుందా? చూడాలి.

ముందు క్రీజులో కుదురుకోండి

తొలి టెస్టులో భారత్ ప్రదర్శన గురించి చెప్పుకోవాలంటే.. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, బుమ్రా తప్ప మిగతా వారందరూ విఫలమయ్యారని చెప్పుకోవాలి. కానీ, కీలకమైన రెండో టెస్టులో భారత ఆటగాళ్లు సమిష్టిగా రాణించడంపై ఫోకస్ పెట్టాల్సిందేనని విశ్లేషకులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో మొదట దూకుడుకు పోకుండా, క్రీజులో కుదురుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా గత మ్యాచ్‌లో విఫలమైన ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. రోహిత్ క్రీజులో పాతుకపోతే ఎంతటి ప్రమాదకారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యువ ఓపెనర్ జైశ్వాల్‌కు దిశానిర్దేశం చేస్తూనే అతను ఇన్నింగ్స్‌ను నడిపించాల్సి ఉంది. శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నది. తొలి టెస్టులో అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అదే ప్రదర్శన పునరావృతం చేయాల్సి ఉంది. నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించే కోహ్లీకి.. మరో ఎండ్‌లో చక్కటి సహకారం అందితే అతన్ని ఆపడం సౌతాఫ్రికా బౌలర్ల తరం కాదు. గిల్, అయ్యర్ నుంచి అతనికి ఆ సహకారం అందాల్సి ఉంది. రెండో టెస్టు కోసం అశ్విన్‌ను పక్కనపెట్టి జడేజాను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. జడేజా రాకతో బ్యాటింగ్ సామర్థ్యం పెరగనుంది. గత మ్యాచ్‌లో నిరాశపర్చిన శార్దూల్ ఠాకూర్‌‌కు నిరూపించుకునేందుకు టీమ్ మేనేజ్‌మెంట్ మరో అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కేప్‌టౌన్ పిచ్ పేస్, బౌన్స్‌కు అనుకూలించనున్న నేపథ్యంలో పేసర్లు జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లపైనే భారత్ నమ్మకం పెట్టుకుంది. వీరు ఏ మేరకు రాణిస్తారన్న దానిపైనే జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మరో పేస్ స్థానం కోసం ప్రసిద్ధ్ కృష్ణ, ముకేశ్ కుమార్ పోటీపడుతున్నారు. ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి.

వీళ్లతో కష్టమే

తొలి టెస్టులో అదరగొట్టిన సౌతాఫ్రికా రెండో టెస్టులోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేస్తుందనడంలో సందేహం లేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణిస్తుండటం ఆ జట్టు ప్రధాన బలం అవ్వగా.. సొంతగడ్డపై ఆడటం సానుకూలంశం. గాయం కారణంగా బవుమా సిరీస్ నుంచి తప్పుకోవడంతో సీనియర్ ఓపెనర్ డీన్ ఎల్గర్ జట్టును నడిపించబోతున్నాడు. ఎల్గర్‌కు ఇదే చివరి మ్యాచ్ కావడం గమనార్హం. గత మ్యాచ్‌లో అతను భారీ సెంచరీతో కదం తొక్కాడు. అతనితోపాటు బెడింగ్‌హామ్, మార్కో జాన్సెన్ సత్తాచాటారు. రెండో టెస్టులో వీరే కాకుండా మార్క్‌రమ్, టోనీ డె జోర్జీ, పీటర్సన్ నుంచి కూడా భారత బౌలర్లకు పరీక్ష తప్పదు. మరోవైపు, పేసర్లు రబాడ, నాండ్రే బర్గర్‌లతో భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఉండాల్సిందే. తొలి టెస్టులో వీరు చెరో 7 వికెట్లతో టీమ్ ఇండియా పతనాన్ని శాసించారు. గెరాల్డ్ కోయెట్జీ దూరమవడం సౌతాఫ్రికాకు ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. అతని స్థానంలో స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌కు చోటు దక్కే అవకాశం ఉంది.

కేప్‌టౌన్‌లో భారత్‌కు సవాలే

కేప్‌టౌన్ వేదికపై భారత్‌కు గొప్ప రికార్డు లేదు. ఒక్కడ ఒక్కడంటే ఒక్క విజయం కూడా సాధించలేదు. సౌతాఫ్రికాతో ఆడిన ఆరు టెస్టులో నాలుగింట ఓడింది. మరో రెండు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. 2022లో చివరిసారిగా ఇక్కడ ఆడిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. కాబట్టి, ఈ సారి కూడా కేప్‌టౌన్‌లో భారత్‌కు సవాల్ తప్పకపోవచ్చు. గత మ్యాచ్ ఆడిన వారిలో ప్రస్తుతం కోహ్లీ, కేఎల్ రాహుల్, అశ్విన్, బుమ్రా, శార్దూల్ మాత్రమే జట్టులో ఉన్నారు. చాలా మందికి సౌతాఫ్రికాలో పర్యటించడం ఇదే తొలిసారి కాగా.. కేప్‌టౌన్‌లో ఏ మేరకు రాణిస్తారో చూడాలి.

పిచ్ రిపోర్టు

కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ స్టేడియం పిచ్‌ పేసర్లకు అనుకూలించనుంది. స్పిన్నర్లు ప్రభావం చూపకపోవచ్చు. ఇక్కడ వికెట్లు తీసిన టాప్-8 బౌలర్లలో స్పిన్నర్లకు చోటు లేదంటే.. పేసర్లు ఏ మేరకు ప్రభావం చూపుతారో అర్థం చేసుకోవచ్చు. ఈ పిచ్‌ ఉపరితలం పేస్, బౌన్సీగా ఉంటుంది. దీంతో బ్యాటర్ల…

Advertisement

Next Story