- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ind Vs NZ: పీకల్లోతు కష్టాల్లో భారత్.. మరోసారి పేకమేడలా కూలిన టాపార్డర్
దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్ (New Zealand)తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా ముంబై (Mumbai)లోని వాంఖడే స్టేడియం (Wankhade Stadium) వేదికగా జరుగుతోన్న మూడో టెస్ట్‌లో టీమిండియా ఎదురీదుతోంది. 171 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కివీస్ (Kiwis) మరో మూడు పరుగు జోడించి 174 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో భారత్ (Team India) 147 పరుగులు చేస్తే ఈ టెస్ట్‌లో విజయం సాధిస్తుంది. కానీ, కివీస్ బౌలర్ల ధాటికి భారత టాపార్డర్ విలవిలాడారు. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (Yashaswi Jaiswal) (5) పరుగులు, కెప్టెన్ రోహిత్ శర్మ (Rohith Sharma) (11) పరుగులు చేసి వెంటవెంటనే అవుటయ్యారు.
అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన శుభ్‌మన్ గిల్ (Subhman Gill) (1), విరాట్ కోహ్లీ (Virat Kohli) (1) కూడా అదే బాటలో పెవీలియన్ చేరారు. ఇక మొదటి టెస్ట్ సెంచరీ హీరో, టెస్ట్ స్పెషలిస్ట్ సర్ఫరాజ్ ఖాన్ (Surfaraz Khan) (1) పరుగు మాత్రమే చేసి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా (Team India) 5 కీలక వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (Rishabh Panth) 13 బంతుల్లో 18 పరుగులు, రవీంద్ర జడేజా (Ravindra Jadeja) 9 బంతుల్లో 3 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు. న్యూజిలాండ్ (New Zealand) బౌలర్లలో స్పిన్నర్ ఎజాజ్ పటేల్ (Azaz Patel) 3 వికెట్లు, మ్యాట్ హెన్రీ (Matt Henry), గ్లెన్ ఫిలిప్స్ (Glenn Philips) చెరో వికెట్ దక్కించుకున్నారు. భారత్ ఈ టెస్ట్‌లో విజయం సాధించాలంటే మరో 106 పరుగులు చేయాల్సి ఉంది.