- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
IND Vs ENG: గిల్, శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీలు.. 25 ఓవర్లు ముగిసేసరికి స్కోర్ ఎంతంటే?

దిశ, వెబ్‌డెస్క్: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్ (Nagpur) వేదికగా జరుగుతోన్న తొలి వన్డేలో ఇంగ్లాండ్ జట్టు 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులో కెప్టెన్ జోస్ బట్లర్ 67 బంతుల్లో 54 పరుగులు, జాకబ్ బెతెల్ 64 బంతుల్లో 51 పరుగులు, సాల్ట్ 26 బంతుల్లో 43 పరుగులు, బెన్ డకెట్ 29 బంతుల్లో 32 పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లలో హర్షిత్ రాణా (Harshith Rana) 3, రవీంద్ర జడేజా (Ravindra Jadeja) 3, మహమ్మద్ షమీ (Mohammed Shami), అక్షర్ పటేల్ (Akshar Patel), హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఒక్కో వికెట్ తీసుకున్నారు.
249 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohith Sharma) కేవలం రెండు పరుగులు చేసి సిద్దిఖీ మహమ్మద్ (Siddiqui Mohammed) బౌలింగ్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) దగ్గర పడుతోన్న వేళ అటు టెస్టుల్లో ఇటు వన్డేల్లో రోహిత్ వరుసగా విఫలం అవ్వడం టీమిండియా (Team India) అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇక మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashswi Jaiswal) 22 బంతుల్లో 15 పరుగులు చేసి జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) బౌలింగ్‌లో పెవీలియన్ చేరాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన శుభ్‌మన్ గిల్ (Shubhman Gill), శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే అయ్యర్ హాఫ్ సెంచరీ (59) చేసి జాకబ్ బెతెల్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (Akshar Patel, గిల్‌లో కలిసి చక్కని భాగస్వామ్యాన్ని నెలకొల్పుతున్నారు. ప్రస్తుతం టీమిండియా (Team India) 26 ఓవర్లు ముగిసేసరికి 3 కీలక వికెట్లు కోల్పో్యి 170 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (Shubhman Gil) 60 బంతుల్లో 51 పరుగులు, అక్షర్ పటేల్ (Akshar Patel 30 బంతుల్లో 34 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు. మరో 78 పరుగులు చేస్తే భారత్ విజయం సాధించి వన్డే సిరీస్‌లో బోణీ కొట్టనుంది.