Imran Khan: పాకిస్థాన్ కిక్రెట్ నాశనం అవుతోంది.. ఇమ్రాన్ ఖాన్ సెన్సేషనల్ కామెంట్స్

by Shiva |
Imran Khan: పాకిస్థాన్ కిక్రెట్ నాశనం అవుతోంది.. ఇమ్రాన్ ఖాన్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy-2025)లో ఆతిథ్య జట్టు పాకిస్థాన్ (Pakistan) వరుస ఓటములతో ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలోనే పాక్ ప్రదర్శనపై జైలు శిక్ష అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని, జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) స్పందించినట్లుగా ఆయన సోదరి అలీమా ఖాన్ (Alima Khan) వెల్లడించారు. ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy)లో పాక్ జట్టు ఓడిపోవడం బాధాకరమంటూ ఇమ్రాన్ బాధపడ్డారని తెలిపారు. ప్రస్తుత పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ (PCB Chairman Mohsin Naqvi) క్రికెట్ అర్హతలను ప్రశ్నించాడని అలీమా ఖాన్ రావల్పిండి జైలు బయట మీడియాతో వెల్లడించారు. బోర్డు నిర్ణయాలను తీసుకునే హక్కు ఎవరికి పడితే వారికి ఇస్తే.. చివరకు పాకిస్థాన్ క్రికెట్ (Pakistan Cricket) నాశనం అవుతుందని ఇమ్రాన్ అన్నారని అలీమా ఖాన్ (Alima Khan) తెలిపారు. అసలు దేశంలో క్రికెట్ పతనానికి మాజీ పీసీబీ చీఫ్ నజామ్ సేథీ (Former PCB chief Najam Sethi) కారణమని ఇమ్రాన్ తనతో అన్నట్లుగా ఆమె పేర్కొన్నారు.

కాగా, పాక్ జట్టు పేలవ ప్రదర్శనకు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) కారణమంటూ పీసీబీ మాజీ చైర్మన్ నజామ్ సేథి (Former PCB chief Najam Sethi) ఇటీవలే ఆరోపణలు గుప్పించారు. 2019 నుంచే జట్టు బలహీనంగా తయారైందని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలోని కొత్త మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాలే అందుకు కారణమని ఫైర్ అయ్యారు. బోర్డులో పాలిటిక్స్ ఎక్కువ అయ్యాయని, విదేశీ కోచ్ లను ఎంపికలో చాలా అవకతవకలు జరిగాయని సేథి ధ్వజమెత్తారు.

Next Story

Most Viewed