- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వరుణ్ చక్రవర్తి నంబర్ 5

- ఏకంగా 25 స్థానాలు ఎగబాకిన స్పిన్నర్
- మరోసాని టాప్ పొజిషన్‌కు ఆదిల్ రషీద్
- ఐదు స్థానాలు పడిపోయిన రవి బిష్ణోయ్
దిశ, స్పోర్ట్స్:
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 5వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అద్బుతంగా రాణిస్తున్న వరుణ్ చక్రవర్తి.. తాజాగా ఐసీసీ ప్రకటించిన టీ20 బౌలర్ల ర్యాంకుల్లో ఏకంగా 25 స్థానాలు ఎగబాకి 5వ ర్యాంకుకు చేరుకున్నాడు. గతంలో 5వ ర్యాంకులో ఉన్న ఇండియన్ బౌలర్ రవి బిష్ణోయ్ ఐదు స్థానాలు కొల్పోయి 10వ ర్యాంకుకు పడిపోయాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న వరుణ్.. మూడో టీ20లో 24 పరుగులే ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓడిపోయినా.. వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక టాప్ టెన్‌లో వరుణ్, రవి బిష్ణోయ్‌తో పాటు అర్షదీప్ సింగ్ కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతను రవి బిష్ణోయ్‌తో కలిసి 10వ ర్యాంకు షేర్ చేసుకుంటున్నాడు.
మళ్లీ టాప్ పొజిషన్‌కు ఆదిల్ రషీద్..
ఇంగ్లాండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ నంబర్ 1 పొజిషన్‌కు మళ్లీ చేరుకున్నాడు. ఇండియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో నిలకడైన ప్రదర్శన చేస్తున్న ఆదిల్.. పర్యాటక జట్టు సిరీస్ మీద ఆశలు సజీవంగా ఉండేలా చేయగలిగాడు. తొలి మ్యాచ్‌లో 1/14, రెండో మ్యాచ్‌లో 1/27 ప్రదర్శన చేసిన ఆదిల్.. రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో ఒక వికెట్ తీసి కేవలం 15 పరుగులే ఇచ్చి ఇండియాను కట్టడి చేశాడు. 2023 చివర్లో తొలి సారి నంబర్ 1 స్థానానికి వచ్చిన ఆదిల్.. 2024లో అకీల్ హుస్సేన్ కారణంగా ఆ స్థానాన్నికోల్పోయాడు. కానీ భారత పర్యటనలో తిరిగి నంబర్ 1 పొజిషన్ సొంతం చేసుకున్నాడు.
టెస్టు క్రికెట్‌లో పాకిస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నొమన్ అలీ నాలుగు స్థానాలు ఎగబాకి ఐదో ర్యాంకుకు చేరుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో అలీ హ్యాట్రిక్ నమోదు చేశాడు. కానీ ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోయింది. ఇక వెస్టిండీస్ బౌలర్ జోమెల్ వారికాన్ 16 స్థానాలు ఎగబాకి 25వ ర్యాంకుకు చేరుకున్నాడు. టెస్టుల్లో బుమ్రా టాప్ పొజిషన్‌లో కొనసాగుతుండగా, బ్యాటర్లలో జో రూట్ నంబర్ 1 ర్యాంకులో ఉన్నాడు.
టీ20 బౌలర్ల ర్యాంకుల పట్టిక
1. ఆదిల్ రషీద్ - ఇంగ్లాండ్ - 718 పాయింట్లు
2. అకీల్ హుస్సేన్ - వెస్టిండీస్ - 707 పాయింట్లు
3. వానిందు హసరంగ - శ్రీలంక - 698 పాయింట్లు
4. అడమ్ జంపా - ఆస్ట్రేలియా - 694 పాయింట్లు
5. వరుణ్ చక్రవర్తి - ఇండియా - 679 పాయింట్లు