టాప్-5 లోకి విరాట్ కోహ్లీ

by John Kora |
టాప్-5 లోకి విరాట్ కోహ్లీ
X

- అగ్రస్థానం కాపాడుకున్న గిల్

- రెండు స్థానాలు మెరుగుపడిన కేఎల్ రాహుల్

- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల

దిశ, స్పోర్ట్స్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టాప్-5లోకి వచ్చాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించి, భారత జట్టు గెలుపులో కోహ్లీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. తాజాగా ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో న్యూజీలాండ్‌కు చెందిన డారిల్ మిచెల్‌ను వెనక్కు నెట్టి కోహ్లీ ఐదో ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక టీమ్ ఇండియా ఓపెనర్ శుభమన్‌గిల్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రెండో స్థానంలో పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ అజామ్ ఉన్నాడు. రోహిత్ శర్మ మూడు స్థానాన్ని కాపాడుకున్నాడు. కేఎల్ రాహుల్ రెండు స్థానాలు ఎగబాకి 15 ర్యాంకుకు చేరుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ 9వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. కివీస్ బ్యాటర్ విల్ యంగ్ ఏకంగా 8 స్థానాలు ఎగబాకి 14వ ర్యాంకుకు చేరుకున్నాడు.

బ్యాటింగ్ ర్యాంకింగ్స్

1. శుభమన్ గిల్ (ఇండియా) - 817 రేటింగ్ పాయింట్స్

2. బాబర్ అజామ్ (పాకిస్తాన్ ) - 770

3. రోహిత్ శర్మ (ఇండియా) - 757

4. హెన్రిచ్ క్లాసెన్ (సౌతాఫ్రికా) - 749

5. విరాట్ కోహ్లీ (ఇండియా) - 743 పాయింట్లు



Next Story