- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
ICC CWC Qualifier 2023: చెలరేగిన సికందర్ రజా.. నెదర్లాండ్స్‌పై జింబాబ్వే ఘన విజయం
![ICC CWC Qualifier 2023: చెలరేగిన సికందర్ రజా.. నెదర్లాండ్స్‌పై జింబాబ్వే ఘన విజయం ICC CWC Qualifier 2023: చెలరేగిన సికందర్ రజా.. నెదర్లాండ్స్‌పై జింబాబ్వే ఘన విజయం](https://www.dishadaily.com/h-upload/2023/06/21/227976-icc-cwc-qualifier-2023.webp)
దిశ, వెబ్‌డెస్క్: ICC CWC Qualifier 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సికందర్ రజా (54 బంతుల్లోనే 102 పరుగులు) వీరోచిత సెంచరీ చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ 4 వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ బ్యాటర్‌లో.. విక్రమ్‌జిత్ సింగ్(88 పరుగులు), మాక్స్ ఒడౌడ్(59 పరుగులు), స్కాట్ ఎడ్వర్డ్స్(83 పరుగులు) రాణించగా.. సికందర్ రజా 55 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.
అనంతరం 316 టార్గెట్‌తో బరిలోకి దిగిన జింబాబ్వే కేవలం 40.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి చేధించింది. జింబాబ్వే బ్యాటర్‌లో.. క్రెయిగ్ ఇర్విన్(50), సీన్ విలియమ్స్(91) రాణించగా.. సికందర్ రజా(54 బంతుల్లో 102 నాటౌట్, ఆరు ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయ సెంచరీతో జట్టును గెలిపించాడు.
Hosts Zimbabwe make it two wins out of two after Sikandar Raza's heroics ✌️
— ICC Cricket World Cup (@cricketworldcup) June 20, 2023
📝: #ZIMvNED: https://t.co/6sP9VYrxb0 | #CWC23 pic.twitter.com/u52nPJgmF6