పాక్‌ క్రికెట్ పతనానికి కారణమదే : గంగూలీ

by Harish |
పాక్‌ క్రికెట్ పతనానికి కారణమదే : గంగూలీ
X

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్‌‌లో టాలెంట్ కొరత తీవ్రంగా ఉందని, ప్రస్తుతం పాక్ క్రికెట్ పతనానికి అదే కారణమని భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. తాజాగా జాతీయ మీడియాతో పాక్ క్రికెట్ పతనంపై గంగూలీ స్పందించాడు. ‘పాక్‌లో ప్రతిభ కొరవడింది. పాకిస్తాన్ అంటే మనకు మిదాంద్, వసీం అక్రమ్, సయీద్ అన్వర్, మహమ్మద్ యూసుఫ్, యునీస్ ఖాన్ లాంటి వాళ్లే గుర్తొస్తారు. ఒకప్పుడు పాక్ జట్టులో గొప్ప ప్లేయర్లు ఉండేవారు. ప్రస్తుత జట్టులో అలాంటి వాళ్లు లేరు. నేను ఇది అగౌరవపర్చడానికి చెప్పడం లేదు. ప్రతి తరంలోనూ టాలెంటెండ్ ఆటగాళ్లను తయారు చేయాలి. పాక్‌లోని క్రికెట్ సంబంధించిన వారు దీని గురించి ఆలోచించాలి.’ అని తెలిపాడు. కాగా, ఇటీవల పాక్ జట్టు సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed