- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సిరాజ్, హెడ్‌లకు షాకిచ్చిన ఐసీసీ.. మాటల యుద్ధంపై సీరియస్

దిశ, స్పోర్ట్స్ : రెండో టెస్టులో భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్, ఆసిస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన వాగ్వాదాన్ని ఐసీసీ సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో చర్యలు చేపట్టింది. సిరాజ్‌కు ఫైన్ విధించిన ఐసీసీ.. మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పెట్టింది.హెడ్‌కు మాత్రం జరిమానా వేయకుండా డీమెరిట్ పాయింట్ మాత్రమే ఇచ్చింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5ను సిరాజ్, ఆర్టికల్ 2.13ని హెడ్ ఉల్లంఘించినట్టు ఐసీసీ తెలిపింది.
ప్రత్యర్థి ప్లేయర్‌ను అవమానపరిచేలా లేదా ప్రతి చర్యను రేకెత్తించేలా చర్యలు చేయడం, భాష ఉపయోగించడం, సైగా చేయడం ఆర్టికల్ 2.5 ప్రకారం ఉల్లంఘన కిందికి వస్తుంది. అలాగే, ఆర్టికల్ 2.13 ప్రకారం.. ఆటగాళ్లను దూషించడం నేరం. ఇద్దరు ప్లేయర్లు తమ తప్పులను అంగీకరించారని ఐసీసీ తెలిపింది. 24 నెలల్లో సిరాజ్, హెడ్ ఐసీసీ నియమాలను ఉల్లంఘించడం ఇదే తొలిసారి.
రెండో టెస్టులో ఆసిస్ ఇన్నింగ్స్‌లో 82వ ఓవర్‌లో హెడ్‌ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అప్పుడు పెవిలియన్‌కు వెళ్లాలని సిరాజ్ సైగ చేయగా.. హెడ్ కూడా ఏదో అనుకుంటూ వెళ్లాడు. అనంతరం దీనిపై ఇద్దరు ఆటగాళ్లు స్పందించారు. తాను ‘వెల్ బౌల్డ్’ అని మాత్రమే అన్నానని, సిరాజ్ తప్పుగా అర్థం చేసుకున్నాడని హెడ్ చెప్పాడు.హెడ్ దూషించాడని, పైగా అబద్ధాలు ఆడుతున్నాడని సిరాజ్ చెప్పుకొచ్చాడు. వీరి మధ్య మాటల యుద్ధం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.