145 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన ఇంగ్లాండ్ యువ బ్యాటర్..

by Vinod kumar |
145 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన ఇంగ్లాండ్ యువ బ్యాటర్..
X

వెల్లింగ్టన్: ఇంగ్లాండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ టెస్టు క్రికెట్‌లో 145 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. వరుస సెంచరీలతో అదరగొడుతున్న బ్రూక్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మ్యాచ్‌లో తొలి రోజు 169 బంతుల్లో 184 పరుగులతో అజేయంగా నిలిచిన అతను 9 ఇన్నింగ్స్‌ల్లోనే 807 పరుగులు చేశాడు. దాంతో 9 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా హ్యారీ బ్రూక్ రికార్డు సృష్టించాడు.

గతంలో ఈ రికార్డు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ(798) పేరిట ఉండగా తాజాగా బ్రూక్ అధిగమించాడు. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 315/3 స్కోరు చేసింది. 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ను జో రూట్(101 బ్యాటింగ్), హ్యారీ బ్రూక్(184 బ్యాటింగ్) జోడీ ఇన్నింగ్స్‌ను నిర్మించింది. రూట్ నిలకడగా ఆడినప్పటికీ.. హ్యారీ బ్రూక్ మాత్రం వన్డే తరహాలో చెలరేగిపోయాడు. కివీస్ బౌలర్లను ఉతికారేశాడు. వీరిద్దరూ సెంచరీలతో సత్తాచాటడంతోపాటు తొలి రోజు 4వ వికెట్‌కు 294 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని జోడించడంతో ఇంగ్లాండ్‌ ఆటలో బలమైన అడుగు వేసింది.

Advertisement

Next Story

Most Viewed