Harbhajan Singh : అడిలైడ్‌ టెస్ట్‌లో భారత్ గెలిస్తే అక్కడికి చేరినట్లే.. : హర్భజన్ సింగ్

by Sathputhe Rajesh |
Harbhajan Singh : అడిలైడ్‌ టెస్ట్‌లో భారత్ గెలిస్తే అక్కడికి చేరినట్లే.. : హర్భజన్ సింగ్
X

దిశ, స్పోర్ట్స్ : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన పెర్త్ టెస్ట్‌లో భారత్ 295 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. అడిలైడ్ జరిగే సెకండ్ టెస్ట్‌లో గెలిస్తే భారత్ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరుకున్నట్లే అని అభిప్రాయపడ్డాడు. మూడో టెస్ట్‌లో గెలిస్తే ఖచ్చితంగా డబ్లూటీసీ ఫైనల్ చేరుకోవచ్చన్నాడు. అయితే ప్రస్తుతం భారత్ ఈ మ్యాచ్ లో గెలవడమే ముఖ్యమని హర్భజన్ అన్నాడు. అడిలైడ్ టెస్ట్‌లో గతంలో భారత్ 36 పరుగులకే ఆలౌట్ అప్రతిష్ట మూటకట్టుకుంది. అయినా మిగతా మ్యాచ్‌ల్లో సత్తా చాటి వరుసగా రెండో సారి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు అడిలైడ్ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఓ సవాలుగా మారింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ చేరాలంటే ఆస్ట్రేలియాపై 4-1 తేడాతో గెలవాల్సి ఉంది. ఒక వేళ 3-2 తేడాతో గెలిస్తే ఆస్ట్రేలియాను తన తదుపరి సిరీస్‌లో శ్రీలంక ఓడిస్తే ఫైనల్ చేరే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Next Story