జర్మనీ ఫుట్‌బాల్ దిగ్గజం ఫ్రాంజ్ బెకెన్‌బౌర్ మృతి

by Swamyn |
జర్మనీ ఫుట్‌బాల్ దిగ్గజం ఫ్రాంజ్ బెకెన్‌బౌర్ మృతి
X

దిశ, స్పోర్ట్స్ : జర్మనీ ఫుట్‌బాల్ దిగ్గజం ఫ్రాంజ్ బెకెన్‌బౌర్(78) కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 78 ఏళ్ల బెకెన్‌బౌర్ మృతి చెందినట్లు జర్మన్ న్యూస్ ఏజెన్సీ డీపీఏ సోమవారం వెల్లడించింది. ఫ్రాంజ్ బెకెన్‌బౌర్ ఆదివారం అర్ధరాత్రి నిద్రలోనే కన్నుమూశారని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. జర్మనీ గ్రేటెస్ట్ ఫుట్‌బాల్ క్రీడాకారుల్లో బెకెన్‌బౌర్ ఒకరుగా నిలిచారు. అతన్ని ‘డెర్ కైజర్‌’గా పిలిచేవారు. జర్మనీ భాషలో డెర్ కైజర్ అంటే చక్రవర్తి అని అర్థం. 1965-1980 మధ్యలో ఆయన వెస్ట్ జర్మనీ తరపున 104 మ్యాచ్‌లు ఆడారు. 1974 వరల్డ్ కప్‌లో వెస్ట్ జర్మనీ జట్టును విజేతగా నిలబెట్టారు. అంతేకాకుండా, 1990 వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు ఆయన కోచ్‌గా వ్యవహరించారు.



Advertisement

Next Story

Most Viewed