- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంభీర్ డిమాండ్లకు బీసీసీఐ ఒకే?.. గౌతీ పెట్టిన డిమాండ్ ఏంటంటే?
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కొత్త హెడ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ నియామకం కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా అందుకు సంబంధించిన ప్రకటన రానున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ‘భారత జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం గంభీర్‌తో చర్చలు జరిపాం. టీ20 వరల్డ్ కప్ తర్వాత ద్రవిడ్ స్థానాన్ని అతను భర్తీ చేస్తాడు.’ అని పేర్కొన్నాయి. భారత హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ఈ టీ20 వరల్డ్ కప్‌తో ముగియనుంది. ఇప్పటికే ప్రధాన కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసింది.
అయితే, మొదటి నుంచి గంభీర్ పేరు ప్రధానంగా వినిపించింది. అతను మెంటార్‌గా ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవడంతో ప్రధాన కోచ్ బాధ్యతలు గంభీరే చేపడతాడన్న వార్తలు ఎక్కువయ్యాయి. బోర్డు పెద్దలు కూడా అతన్ని పలుమార్లు కలిసినట్టు తెలుస్తోంది. బోర్డు పెద్దల ముందు గంభీర్ పలు డిమాండ్లు పెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అతను సొంత సపోర్టింగ్ స్టాఫ్‌ను అడిగినట్టు సమాచారం. వాటికి బోర్డు ఆమోదం తెలిపినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నెల చివరి వారంలో గంభీర్ నియామకంపై అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది. గంభీర్ హెడ్ కోచ్ నియాకమైతే 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆ బాధ్యతల్లో ఉండాల్సి ఉంటుంది. టీ20 ప్రపంచకప్ అనంతరం ఐదు టీ20ల సిరీస్ కోసం భారత జట్టు జింబాబ్వేలో పర్యటించనుంది. ఈ సిరీస్‌తోనే గంభీర్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.