- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Frank Duckworth: క్రికెట్‌లో తీవ్ర విషాదం.. ‘డీఎల్ఎస్’ సహ రూపకర్త డక్‌వర్త్ కన్నుమూత

దిశ, వెబ్‌డెస్క్: ‘డక్ వర్త్ లూయిస్’.. ఈ పదం ఎక్కడో విన్నట్లుంది కదా. అవును నిజమే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ మధ్యలో వర్షం అంతరాయం కలిగినప్పుడు ఐసీసీ అమలు చేసేదే ‘డక్ వర్త్ లూయిస్’ మెథడ్. అయితే, ప్రస్తుతం డీఎల్ఎస్ రూపకర్తల్లో ఒకడైన ఫ్రాంక్ డక్‌వర్త్ (84) ఈ నెల 21న తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశాడు. ఆయన చనిపోయి ఐదు రోజుల తరువాత వార్త వెలుగులోకి వచ్చింది. ఇంగ్లండ్ దేశానికి చెందిన డక్‌వర్త్ గణాంక నిపుణుడు. ఆయన టోనీ లూయిస్‌తో కలిసి క్రికెట్‌లో డీఎల్‌ఎస్ పద్ధతిని ప్రవేశపెట్టారు. వర్షంతో మ్యాచ్ సమయం వృథా అయితే ఉన్న సమయంలో మ్యాచ్ ఫలితాన్ని తేల్చేందుకు అప్పటికి నెట్ రన్‌రేట్, వికెట్లను ఆధారంగా చేసుకుని ఓవర్లు, ఇటు రన్లను కుదిస్తారు. కాల క్రమేనా ఈ పద్ధతిని క్రికెట్‌లో డక్‌వర్త్ లూయిస్ పేరిట అమలు అవుతూ వస్తుంది. డీఎల్‌ఎస్ పద్ధతిని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 1997లో తొలిసారిగా అమలు చేసింది. అనంతరం వర్ష ప్రభావిత మ్యాచుల్లో లక్ష్యాల్ని నిర్ణయించడానికి 2001లో ఈ పద్ధతిని ఐసీసీ ప్రామాణికంగా తీసుకుంది.