సౌతాఫ్రికాకు గుడ్ న్యూస్.. స్టార్ క్రికెటర్ రీ ఎంట్రీ!

by Vinod kumar |
సౌతాఫ్రికాకు గుడ్ న్యూస్.. స్టార్ క్రికెటర్ రీ ఎంట్రీ!
X

దిశ, వెబ్‌డెస్క్:సౌతాఫ్రికా క్రికెట్ నుంచి తప్పుకున్న మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మళ్లీ జాతీయ టీమ్ తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అనూహ్యంగా 2021 లో రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ప్రోటీస్ వైట్ బాల్ జట్టు తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే డుప్లెసిస్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ వివిధ ఫ్రాంచైజీ లీగ్‌ల్లో ఆడుతున్నాడు. డుప్లెసిస్ ఇప్పటికే సౌతాఫ్రికా కొత్త వైట్ బాల్ కోచ్ రాబ్ వాల్టర్‌ను కలిసిన్నట్టు సమాచారం. స్వదేశంలో విండీస్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌ల్లో డుప్లెసిస్‌కు చోటు దక్కే అవకాశం ఉంది.

Advertisement

Next Story