Ashes 2023: ఇంగ్లండ్ పేసర్ అరుదైన ఘనత..

by Vinod kumar |
Ashes 2023: ఇంగ్లండ్ పేసర్ అరుదైన ఘనత..
X

దిశ, వెబ్‌డెస్క్: యాషెస్ నాలుగో టెస్టులో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అరుదైన ఘనత సాధించాడు. 600వ టెస్టు వికెట్‌ను బ్రాడ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో క్రికెట్ లెజెండ్స్ షేన్ వార్న్, అనిల్ కుంబ్లే, జేమ్స్ ఆండర్సన్ సరసన చేరాడు. వీళ్లందరూ కూడా టెస్టుల్లో 600పైగా వికెట్లు తీసుకున్న దిగ్గజ బౌలర్లే. నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో తొలుత ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో బ్రాడ్ బంతితో 2 కీలక వికెట్లు తీసుకున్నాడు.

ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఉస్మాన్ ఖవాజాను పెవిలియన్ చేర్చిన అతను.. 50వ ఓవర్లో ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేశాడు. ఇది టెస్టుల్లో బ్రాడ్‌కు 600వ వికెట్ కావడం గమనార్హం. క్రికెట్ చరిత్రలో అతి తక్కువ మంది బౌలర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇప్పటి వరకు టెస్టుల్లో శ్రీలంక గ్రేట్ ముత్తయ్య మురళీ ధరన్ (800), ఆసీస్ లెజెండ్ షేన్ వార్న్ (708), ఇంగ్లండ్ దిగ్గజం జేమ్స్ ఆండర్సన్ (688), ఇండియా లెజెండ్ అనిల్ కుంబ్లే (619) మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed