ఫ్రెంచ్ ఓపె‌న్‌కు ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ దూరం..

by Vinod kumar |
ఫ్రెంచ్ ఓపె‌న్‌కు ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ దూరం..
X

లండన్: ఇంగ్లాండ్ స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి, 2021 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఎమ్మా రాడుకాను ఈ ఏడాదిలో మరో రెండు మేజర్ గ్రాండ్‌స్లామ్స్‌కు అందుబాటులో ఉండటం లేదు. ఇటీవల ఆమె కాలుతోపాటు చేతికి చిన్నపాటి సర్జరీ చేయించుకోవడంతో కొన్ని నెలలపాటు టెన్నిస్‌కు దూరం కానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల చివర్లో ప్రారంభమయ్యే ఫ్రెంచ్ ఓపెన్‌తోపాటు జూలైలో జరిగే వింబుల్డన్ టోర్నమెంట్‌‌లో ఆమె పాల్గొనడం లేదు.

ఈ విషయాన్ని ఎమ్మా రాడుకాను సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఆ పోస్టుకు హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఫొటోను జతచేసింది. కాగా, గతేడాది నుంచి ఆమెను గాయాలు వేధిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాడుకాను ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed