- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఢిల్లీ క్యాపిటల్స్ భారీ ప్లాన్.. ఐపీఎల్-2025 కోసం వరల్డ్ కప్ విన్నింగ్ కోచ్

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2025 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ కోచ్‌ను తమ కోచింగ్ స్టాఫ్‌లోకి తీసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ మోట్‌ను అసిస్టెంట్‌గా కోచ్‌గా నియమించినట్టు మంగళవారం వెల్లడించింది. కోచ్‌గా మోట్‌కు మంచి అనుభవం ఉంది. 2015-2022 వరకు ఆస్ట్రేలియా మహిళల జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో ఆసిస్ ఓ సారి వన్డే వరల్డ్ కప్, రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ పురుషుల జట్టుకు కోచ్‌గా మారాడు. 2022లో ఇంగ్లాండ్ టీ20 వరల్డ్ కప్ సాధించింది.
అయితే, గతేడాది జూలైలో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్‌లో 2008, 2009 సీజన్లలో కోల్‌కతాకు సేవలందించాడు. మోట్ విస్తృతమైన కోచింగ్ అనుభవాన్ని ఉపయోగించుకోవాలని ఢిల్లీ ఫ్రాంచైజీ భావిస్తున్నది. వచ్చే సీజన్ కోసం ఫ్రాంచైజీ కోచింగ్ స్టాఫ్‌లో సమూల మార్పులు చేసిన విషయం తెలిసిందే. రికీ పాంటింగ్‌ను తప్పించి హెమాంగ్ బడానిని హెడ్ కోచ్‌గా నియమించింది. అలాగే, గంగూలీ స్థానంలో డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వేణుగోపాల్ రావును, బౌలింగ్ కోచ్‌గా మునాఫ్ పటేల్‌ను తీసుకుంది. అయితే, వచ్చే సీజన్ కోసం జట్టు ఇంకా కెప్టెన్‌ను ప్రకటించలేదు. కేఎల్ రాహుల్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువ.