- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Champions Trophy 2025: సెమీస్‌కు సౌతాఫ్రికా.. ఇంగ్లండ్‌పై ఘన విజయం

దిశ, వెబ్‌డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)లో భాగంగా పాకిస్తాన్(Pakistan)లోని కరాచీ(Karachi) మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్(England)పై సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని 29 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో టోర్నీ నుంచి ఇంగ్లండ్ నిష్ర్కమించగా.. సౌతాఫ్రికా సెమీస్‌కు దూసుకెళ్లింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. 38.2 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లు క్రీజులోకి వచ్చిన వారు వచ్చినట్టే పెవిలియన్‌కు వెళ్లారు. అత్యధికంగా జో రూట్ 37 పరుగులు చేశాడు. ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్ 25, బెన్ డకెట్ 24, జోస్ బట్లర్ 21, హ్యారీ బ్రూక్ 19 పరుగులు, సాల్ట్ కేవలం 8 పరుగులు మాత్రమే చేశారు. మొత్తంగా 38.2 ఓవర్లలో 179 పరుగులు చేసింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా బ్యాటర్లు నిలకడకగా రాణించారు. దుస్సెస్ 72, క్లాసెన్ 64, ర్యాన్ 27 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. 29.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి.. ఏడు వికెట్ల తేడాతో గెలుపొందారు.