BREAKING: టీ20లకు గుడ్‌బై చెప్పిన విరాట్ కోహ్లీ.. ట్విట్టర్‌ వేదికగా ప్రధాని మోడీ స్పెషల్ మెసేజ్

by Shiva |
BREAKING: టీ20లకు గుడ్‌బై  చెప్పిన విరాట్ కోహ్లీ.. ట్విట్టర్‌ వేదికగా ప్రధాని మోడీ స్పెషల్ మెసేజ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా బంపర్ విక్టరీ కొట్టింది. బర్బడోస్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఉత్కంఠ పోరులో 17 నీరీక్షణకు తెరదించుతూ.. టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. టాపార్డర్ బ్యాట్స్‌మెన్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టిన వేళ విరాట్ కోహ్లీ వీరోచిత బ్యాటింగ్‌తో జట్టు పోరాడే స్కోరును ప్రత్యర్థి ముందు ఉంచింది. అనంతరం అద్భుతమైన బౌలింగ్‌తో ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపినా.. చివరికి విజయం భారత్‌నే వరించింది. ఈ క్రమంలో మ్యాచ్ ముగిసిన వెంటనే టీమిండియా అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్లు ప్రకటించారు.

అయితే,140 కోట్ల మంది భారత ప్రజల ఆకాంక్షను నేరవేర్చిన టీమిండియాను ఉద్దేశించి, ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన చేసిన విరాట్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదిక పొగడ్తల జల్లు కురిపించారు. ఆయన విరాట్ ఫొటోను ట్యాగ్ చేస్తూ..‘మీతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫైనల్స్‌ అత్యద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అన్ని రంగాల్లోనూ అత్యత్తమ ప్రతిభన కనబరిచారు. టీ20 క్రికెట్ మిమ్మల్ని కోల్పోతుంది. కానీ, కొత్త తరం ఆటగాళ్లను ఎంకరేజ్ చేసేందుకు మీరు చేసిన త్యాగం అమోఘం. ఇకపై యువతను ఇలాగే ప్రోత్సహిస్తూ ఉంటారని నేను విశ్వసిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవతోంది.

Advertisement

Next Story

Most Viewed