BGT : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం వేళ గంభీర్‌పై పాంటింగ్ ఘాటు వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |
BGT : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం వేళ గంభీర్‌పై పాంటింగ్ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా గంభీర్ తనపై చేసిన వ్యాఖ్యలకు పాంటింగ్ కౌంటర్ ఇచ్చాడు. గంభీర్‌ది ‘ప్రిక్లీ క్యారెక్టర్’(తొందరగా టెంపర్ లాస్ కావడం) అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ తనపై చేసిన వ్యాఖ్యలకు ఆశ్చర్యపోవడం లేదని మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ అన్నాడు. ప్రస్తుతం ఫామ్‌లేమి గురించి విరాట్ కోహ్లిని అడిగిన చెబుతాడని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియాలో గతంలో విరాట్ టాప్ క్లాస్ క్రికెట్ ఆడాడని.. మళ్లీ అతను తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యే చాన్స్ ఉందన్నాడు. గతంలో వరుసగా సెంచరీలతో రెచ్చిపోయిన కోహ్లి ప్రస్తుతం ఆ స్థాయిలో క్రికెట్ ఆడటం లేదన్నాడు. ఇది ఏ మాత్రం అతడిని కించపరిచినట్లు కాదన్నాడు. విరాట్ ఈ ఏడాది ఆడిన 19 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కేవలం 488 పరుగులు మాత్రమే చేశాడని పాంటింగ్ అన్నాడు. విరాట్ కోహ్లి ఫామ్‌పై పాంటింగ్ వ్యా్ఖ్యలను ఖండించిన గౌతమ్ గంభీర్ ఆస్ట్రేలియా జట్టు సంగతి చూసుకోవాలని హితవు పలికిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed