2024 ఆసియా కప్‌కు మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ

by Mahesh |
2024 ఆసియా కప్‌కు మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 మహిళల ఆసియా కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా, వైస్ కెప్టెన్ గా స్మృతి మంధాన ను ఎంపిక చేశారు. మొత్తం 15 మందికి షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (WK), ఉమా చెత్రీ (WK), పూజా వస్త్రాకర్, అరుంధతీ రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్ , దయాలన్ హేమలత, ఆశా శోభన, రాధా యాదవ్, ప్రియాంక పాటిల్, సజన సజీవన్ భారత జట్టులో చోటు దక్కింది. శ్రీలంక వేదికగా జరగనున్న టోర్నమెంట్ జూలై 19 నుంచి ప్రారంభమై జూలై 28న జరిగే ఫైనల్ మ్యాచుతో ముగియనుంది.

మొత్తం ఈ ట్రోఫీలో ఇండియా, నేపాల్, పాకిస్తాన్, యూఏఈ, బంగ్లాదేశ్, మలేషియా, శ్రీలంక, తైలాండ్ తో కలిపి 8 జట్లు తలపడనున్నాయి. ఈ ట్రోఫీని మొత్తం రెండు గ్రూపులుగా విడదీయగా గ్రూప్-లో ఇండియా, నేపాల్, పాకిస్తాన్, యూఏఈ ఉండగా, గ్రూప్-Bలో బంగ్లాదేశ్, మలేషియా, శ్రీలంక, తైలాండ్ జట్లు తలపడనున్నాయి. రెండు గ్రూపుల్లోని ప్రతి జట్టు మూడు మ్యాచులు ఆడగా.. సూపర్ ఫోర్ కు చేరిన జట్లకు రెండు సెమీ ఫైనల్ మ్యాచులు జరుగుతాయి. వాటిల్లో గెలిచిన రెండు జట్లు జూలై 28 ఫైనల్ మ్యాచులో తలపడనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed