- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బ్యాటింగ్ చేసేటప్పుడు అదొక్కటే ఆలోచించా : శివమ్ దూబె
దిశ, స్పోర్ట్స్ : ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో టీమ్ ఇండియా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో అఫ్గాన్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన శివమ్ దూబె ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా శివమ్ దూబె మాట్లాడుతూ.. ‘ఆటను చాలా ఎంజాయ్ చేశా. చాలా రోజుల తర్వాత ఆడటం, నం.4లో బ్యాటింగ్ రావడం నాపై ఒత్తిడి కలిగించింది. కానీ, మైండ్‌లో మాత్రం నా స్టైల్‌లో బ్యాటింగ్ చేయాలని అనుకున్నా. మొదట కాస్త ఒత్తిడి ఉన్నా.. ఆ తర్వాత బంతి గురించి ఎక్కువగా ఆలోచించలేదు. టీ20ల్లో సిక్స్‌లు కొట్టగలనని నాకు తెలుసు. మ్యాచ్ అనంతరం రోహిత్ నా ఆటను మెచ్చుకున్నాడు. రాబోయే మ్యాచ్‌ల్లో ఆటను మెరుగుపర్చుకోవాలని చెప్పాడు.’ అని శివమ్ దూబె చెప్పుకొచ్చాడు. కాగా, ఈ మ్యాచ్‌లో శివమ్ దూబె బంతితో, బ్యాటుతో రాణించాడు. రెండు ఓవర్లు వేసిన అతను 9 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అనంతరం ఛేజింగ్‌లో హాఫ్ సెంచరీతో మెరిశాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60 పరుగులతో అజేయంగా నిలిచాడు.