- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అప్పుడు అతిగా ప్రవర్తించా.. ఐపీఎల్‌లో హెల్మెట్ నేలకేసి కొట్టడంపై అవేశ్ ఖాన్ కామెంట్
న్యూఢిల్లీ : ఐపీఎల్-16 ఎంత రసవత్తరంగా సాగిందో.. కాంట్రవర్సీలు కూడా అంతే చర్చనీయాంశమయ్యాయి. అందులో లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ అవేశ్ ఖాన్ హెల్మెట్ నేలకేసి కొట్టడం ఒకటి. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లక్నో గెలిచిన ఆనందంలో అతను హెల్మెట్ నేలకేసి కొట్టి సంబరాలు చేసుకున్న విషయం తెలిసిందే. అతడు అతిగా ప్రవర్తించాడని విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవేశ్ ఖాన్ ఆ సంఘటనపై స్పందించాడు. ఆ సమయంలో తాను కాస్త అతి చేశానని, అలా చేసి ఉండాల్సింది కాదని విచారం వ్యక్తం చేశాడు. ‘అప్పుడు అతిగానే చేశాను. ఆనందంలో అలా చేశాను. ఆ తర్వాత అలా ఎందుకు చేశానని బాధపడ్డా. అలా చేయాల్సింది కాదని రియలైజ్ అయ్యాను.’ అని తెలిపాడు.
గతేడాది సెప్టెంబర్‌లో చివరిసారిగా భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన అవేశ్ ఖాన్.. తిరిగి జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే తాను జాతీయ జట్టులోకి తిరిగి వస్తానని అవేశ్ ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, ఐపీఎల్-16 లీగ్ దశలో బెంగళూరు, లక్నో జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగింది. ఆఖరి బంతికి ఒక్క పరుగు కావాల్సి ఉండగా.. అవేశ్ ఖాన్ పరుగు సాధించాడు. ఉత్కంఠ మ్యాచ్‌లో లక్నో గెలిచిన ఆనందంలో అవేశ్ ఖాన్ తన హెల్మెట్‌ను నేలకోసి కొట్టి సంబరాలు చేసుకున్నాడు.