- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Praggnanandhaa: ప్రజ్ఞానంద తల్లికి 'అమూల్' గిఫ్ట్..
దిశ, వెబ్‌డెస్క్: భారత యువ చెస్ సంచలనం, గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద చెస్ ప్రపంచకప్ ఫైనల్‌లో రన్నరప్‌గా నిలిచి కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో ప్రజ్ఞానందతో పాటు ఎక్కువ మంది అభిమానులను సొంతం చేసుకుంది వాళ్ల అమ్మ నాగలక్ష్మి. తన కొడుకు విజయాన్ని ప్రత్యక్షంగా చూస్తూ.. ఆనందంతో కన్నీరు పెట్టుకున్న సందర్భాలు, ప్రజ్ఞానంద మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్లలో వర్ణించలేని ఆనందం.. ఇలాంటి ఈ మధుర క్షణాలను బంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
ప్రజ్ఞానంద తల్లి నాగలక్ష్మి అమూల్ సంస్థ ప్రత్యేకమైన బహుమతి అందించింది ఈ నేపథ్యంలో అమూల్ సంస్థ ప్రత్యేకంగా ఓ కార్టూన్‌ను విడుదల చేసింది. చెస్ బోర్డు ముందర ప్రజ్ఞానంద కూర్చొని ఉండగా వాళ్ల అమ్మ బ్రెడ్‌ని తీసుకొని వచ్చి కుమారునికి అందిస్తున్నట్లు ఓ ఫొటోను అమూల్ తయారు చేసింది. ప్రజ్ఞానంద విజయంలో ఆమె పాత్ర చాలా కీలకమైనదిగా చూపిస్తోంది ఆ చిత్రం. అమూల్ ఈ చిత్రాన్ని కంపెనీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. దీంతో ఆ పోస్టుపై అభిప్రాయాలను నెటిజన్లు కామెంట్ల రూపంలో పంచుకున్నారు.
- Tags
- Praggnanandhaa