IPL 2025: అంబటి రాయుడుకు బిగ్ షాక్...ఇక కనుమరుగు కావడమే?

by Veldandi saikiran |   ( Updated:2025-04-05 11:59:17.0  )
IPL 2025:  అంబటి రాయుడుకు బిగ్ షాక్...ఇక కనుమరుగు కావడమే?
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 )నేపథ్యంలో... చెన్నై సూపర్ కింగ్స్ ( CSK ) మాజీ ప్లేయర్, ప్రస్తుత కామెంటేటర్ ( Commentator ) అంబటి రాయుడుకు ( Ambati Rayudu) బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఇకపై ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో కామెంట్రీ చేయకుండా... అంబటి రాయుడు పై వేటు వేసేందుకు చర్యలు తీసుకోనున్నారట. ఈ మేరకు ఐపీఎల్ యాజమాన్యం... అడుగులు వేస్తున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో కామెంట్రీ, విశ్లేషణ సమయాలలో ఒక జట్టును కించపరిచేలా, అదే సమయంలో మరో జట్టును పొగుడుతూ అంబటి రాంబాబు వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదులు అందినట్లు చెబుతున్నారు.

ఇలా ఒక కామెంట్రీ చేసే వ్యక్తి కక్షపూరితంగా... వ్యవహరించకూడదని ఐపీఎల్ యాజ మాన్యం చాలా సీరియస్ గా ఉందని చెబుతున్నారు. అందుకే అతన్ని ఇకపై కామెంట్రీ చేయకుండా... నోటీసులు ఇచ్చే ఛాన్సులు ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ.. సోషల్ మీడియా అలాగే జాతీయ మీడియాలలో కథనాలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా... ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నేపథ్యం లో.. గతంలో ముంబై ఇండియన్స్ కు ఆడిన అంబటి రాయుడు... ఆ తర్వాత... చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత క్రికెట్ కు దూరమైన అంబటి రాయుడు... కామెంట్రీ చేసుకుంటున్నాడు. అటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనూ యాక్టీవ్ గానే ఉంటున్నారు అంబటి రాయుడు.

Next Story

Most Viewed