- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇంగ్లాండ్‌ను ఇంటికి పంపిన ఆఫ్గానిస్తాన్

- ఉత్కంఠ పోరులో ఆఫ్గాన్ విజయం
- రికార్డు సెంచరీతో చెలరేగిన ఇబ్రహీం
- భారీ స్కోర్ ఛేదనలో ఇంగ్లాండ్ విఫలం
- జో రూట్ భయపెట్టినా.. తప్పని ఓటమి
- చాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంగ్లాండ్ ఔట్
- ఆఫ్గాన్ ఆశలు సజీవం
దిశ, స్పోర్ట్స్: పసి కూనలే అని లైట్ తీసుకుంటే.. ఆఫ్టాన్ టీమ్ ఏం చేసి చూపించగదో మరో సారి నిరూపించారు. గతంలో కూడా కీలక మ్యాచ్‌లలో పెద్ద టీమ్స్‌కు షాకిచ్చిన ఆఫ్గానిస్తాన్.. చాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంగ్లాండ్‌ను ఇంటికి సాగనంపింది. పరిపూర్ణమైన క్రికెట్‌ను ఆడి విజయం సాధించడమే కాకుండా.. అందరి మనసులను గెలిచింది. బ్యాటింగ్‌లో ఇబ్రహీం సెంచరీతో చెలరేగిపోగా.. బౌలింగ్‌లో కాస్త తడబడినా నిలబడింది. ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ సెంచరీతో భయపెట్టినా.. ఆఫ్గాన్ బౌలర్లు మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా పోరాడారు. చివరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఆఫ్గాన్ జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. సెంచరీ కొట్టిన ఇబ్రహీంకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
భయపెట్టిన జో రూట్..
చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ బిలో ఆఫ్గానిస్తాన్, ఇంగ్లాండ్ మధ్య లాహోర్‌లోని గఢాఫీ స్టేడియంలో కీలక మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గానిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 325/7 స్కోర్ సాధించింది. ఇక 326 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు టాపార్డర్ తడబడింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (12)ను అజ్మతుల్లా బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన జేమీ స్మిత్ (9) కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేక పోయాడు. మరో ఓపెనర్ బెన్ డకెట్, జో రూట్ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వీరిద్దరూ కలసి మూడో వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బెన్ డకెట్ (38)ను రషీద్ ఖాన్ ఎల్బీడబ్ల్యూగా పెవీలియన్ పంపాడు. అయితే జో రూట్ తర్వాత వచ్చిన బ్యాటర్లతో చిన్ని చిన్న భాగస్వామ్యాలు నెలకొల్పాడు. హ్యారీ బ్రూక్ (25), జాస్ బట్లర్ (38) పర్వాలేదనిపించినా.. లియామ్ లివింగ్‌స్టన్ (10) తక్కువ పరుగులకే పెవీలియన్ చేరాడు. ఇక సెంచరీ పూర్తి చేసుకొని ప్రమాదకరంగా మారిన జో రూట్ (120) అజ్మతుల్లా బౌలింగ్‌లో గుర్జాబ్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత జేమీ ఓవర్టన్ (32), జోఫ్రా ఆర్చర్ (14) ధాటిగా ఆడటానికి ప్రయత్నించి ఔటయ్యారు. ఆఖర్లో ఆఫ్గాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడమే కాకుండా, ఫీల్డింగ్ కూడా చక్కగా చేయడంతో ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఆఫ్గానిస్తాన్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ 5, మహ్మద్ నబి 2 వికెట్లు తీయగా.. ఫరూఖీ, రషీద్ ఖాన్, గుల్బదీన్ తలా ఒక వికెట్ తీశారు.
రికార్డు సెంచరీ నమోదు చేసిన ఇబ్రహీం..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్గానిస్తాన్ జట్టు టాప్ ఆర్డర్‌ను ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కుప్పకూల్చాడు. ఓపెనర్ రహ్మానుల్లా కేవలం 15 పరుగులకే పెవీలియన్ చేరాడు. ఫస్ట్ డౌన్‌లో వచ్చిన సిదీఖుల్లా అతల్ 4, ఆ తర్వాత వచ్చిన రహ్మద్ షా 4 పరుగులకే వెనుదిరిగాడు. 37 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన ఆఫ్గాన్ జట్టును మరో ఓపెనర్ ఇబ్రహీం జర్దాన్, హష్మతుల్లా షాహిది ఆదుకున్నారు. వీరిద్దరూ కలసి ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని, నాలుగో వికెట్‌కు 107 పరుగుల భాగస్వామ్యం అందించారు. హష్మతుల్లా (40) ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అజ్మతుల్లా ఒమర్జాయ్ దూకుడుగా ఆడాడు. కేవలం 31 బంతుల్లోనే 41 పరుగులు సాధించాడు. మరో ఎండ్‌లో ఉన్న ఇబ్రహీం బౌండరీలు, సిక్సులతో చెలరేగి పోయాడు. ఈ క్రమంలో 106 బంతుల్లో సెంచరీ చేశాడు. అజ్మతుల్ల అవుటైన తర్వాత వచ్చిన మహ్మద్ నబీ.. ఇబ్రహీంతో పాటుగా చెలరేగి పోయాడు. ఇద్దరూ బౌండరీలు, సిక్సులు బాదుతూ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరూ కలిసి 6వ వికెట్‌కు 111 పరుగులు జోడించారు. 177 పరుగులు చేసిన ఇబ్రహీం ఆఖరి ఓవర్లో అవుటయ్యాడు. ఆ తర్వాత నబీ కూడా పెవీలియన్ చేరాడు. చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగుల బాదిన బ్యాటర్‌గా ఇబ్రహీం (177) రికార్డు సృష్టించాడు. ఆఫ్గానిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. జోఫ్రా ఆర్చర్ 9, లియామ్ లివింగ్‌స్టన్ 2, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ చెరో వికెట్ తీశారు.
స్కోర్ బోర్డు:
అఫ్గానిస్తాన్ : రహ్మానుల్లా గుర్జాజ్ (బి) జోఫ్రా ఆర్చర్ 6, ఇబ్రహీం జర్దాన్ (సి) జోఫ్రా ఆర్చర్ (బి) లియామ్ లివింగ్‌స్టన్ 177, సిదీఖుల్లా అతల్ (ఎల్బీడబ్ల్యూ)(బి) జోఫ్రా ఆర్చర్ 4, రహ్మద్ షా (సి) ఆదిల్ రషీద్ (బి) జోఫ్రా ఆర్చర్ 4, హష్మతుల్లా షాహిది (బి) ఆదిల్ రషీద్ 40, అజ్మతుల్లా ఒమర్జాయ్ (సి)(సబ్) టామ్ బాంటన్ (బి) జామీ ఓవర్టన్ 41, మహ్మద్ నబి (సి) జో రూట్ (బి) లియామ్ లివింగ్‌స్టన్ 40, గుల్బదీన్ నాయబ్ 1 నాటౌట్, రషీద్ ఖాన్ 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 11 (మొత్తం 314/10, 50 ఓవర్లు)
వికెట్ల పతనం : 11-1, 15-2, 37-3, 140-4, 212-5, 323-6, 324-7
బౌలింగ్ : జోఫ్రా ఆర్చర్ (10-0-64-3), మార్క్ వుడ్ (8-0-50-0), జేమీ ఓవర్టన్ (10-0-72-1), ఆదిల్ రషీద్ (10-0-60-1), జో రూట్ (7-0-47-0), లియామ్ లివింగ్‌స్టన్ (5-0-28-2)
ఇంగ్లాండ్ : ఫిలిప్ సాల్ట్ (బి) అజ్మతుల్లా 12, బెన్ డకెట్ (ఎల్బీడబ్ల్యూ)(బి) రషీద్ ఖాన్ 38, జేమ్ స్మిత్ (సి) అజ్మతుల్లా (బి) నబీ 9, జో రూట్ (సి) గుర్బాజ్ (బి) అజ్మతుల్లా 120, హ్యారీ బ్రూక్ (సి) అండ్ (బి) నబీ 25, జాస్ బట్లర్ (సి) రహ్మత్ (బి) అజ్మతుల్లా 38, లియామ్ లివింగ్‌స్టన్ (సి) గుర్బాజ్ (బి) గుల్బదీన్ 10, జేమీ ఓవర్టన్ (సి) నబీ (బి) అజ్మతుల్లా 32, జోఫ్రా ఆర్చర్ (సి) నబీ (బి) ఫారూఖీ 14, ఆదిల్ రషీద్ (సి) ఇబ్రాహీం జర్దాన్ (బి) అజ్మతుల్లా 5, మార్క్ వుడ్ 2 నాటౌట్, ఎక్స్‌ట్రాలు 12; మొత్తం 317/10(49.5 ఓవర్లు)
వికెట్ల పతనం : 19-1, 30-2, 98-3, 133-4, 216-5, 233-6, 287-7, 309-8, 313-9, 317-10
బౌలింగ్ : ఫరూఖీ (10-0-62-1), అజ్మతుల్లా ఒమర్జాయ్ (9.5-0-58-5), మహ్మద్ నబీ (8-0-57-2), రషీద్ ఖాన్ (10-0-66-1), నూర్ అహ్మద్ (10-0-51-0), గుల్బదీన్ (2-0-16-1)