TRS ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి అరుదైన గౌరవం 

by Shyam |
TRS ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి అరుదైన గౌరవం 
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్ : విశ్వగురు అంతర్జాతీయ రికార్డ్స్ సంస్థ ప్రక‌టించిన‌ స్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అందుకున్నారు. మంగళవారం రాజ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును గవర్నర్ అందజేశారు.

కరోనా, లాక్ డౌన్‌తో పాటు హైదరాబాద్ నగరంలో గత ఏడాది వచ్చిన అకాల వర్షాలు, వ‌ర‌ద‌ల స‌మ‌యంలో రాజకీయాలకు అతీతంగా, ప్రజలకు, అంధులు, వికలాంగులు, అనాథలకు అందించిన సేవలను గుర్తించిన విశ్వగురు అంతర్జాతీయ రికార్డ్స్ సంస్థ సుధీర్ రెడ్డికి అంతర్జాతీయ స్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డును ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు, సంస్థ సీఈవో సత్యవోలు రాంబాబు, డైరెక్టర్ పూజిత, సోషల్ మీడియా ఇన్‌చార్జి రమాకాంత్, ఎంఆర్‌డీసీఎల్ చైర్మన్ ఓఎస్డి పగడాల శివప్రసాద్, కృష్ణ సాగర్ పాల్గొన్నారు.

Advertisement

Next Story