- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Zen Ji Language : సోషల్ మీడియాలో కేక పుట్టిస్తున్న న్యూ వర్డ్స్

మన మనసులోని భావాలు ఎదుటివారికి అర్థమయ్యేలా చేసేది భాష. అది ఎంత సరళంగా ఉంటే అంత సులభంగా భావవ్యక్తీకరణ జరుగుతుంది. అందుకే భాష కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు సరళీకృతం అవుతూనే ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో చుట్టూ ఎందరు ఉన్నా మనం మాట్లాడుకునేది ఎవరికీ అర్థం కావొద్దని అనుకుంటాం. అలాంటి సందర్భాల్లో కోడ్ పదాలు వాడుతుంటాం. అలాంటి పదాలతో ప్రత్యేకంగా కొన్ని భాషలే ఉన్నాయి. సైనికులు రహస్య సమాచార పంపిణీకి మోర్స్ కోడ్ వాడుతారు. దీనిని రూపొందించేందుకు ఎంతో పరిశోధనలు సైతం జరిగాయి. ఆ భాషను ఒకచోటికి ట్రాన్స్ మిట్ చేసేందుకు ప్రత్యేకంగా పరికరాలు సైతం తయారుచేశారు. ఇవన్నీ పక్కనబెడితే. మరి సామాన్యుల మాటేమిటి? వాళ్లకు రహస్యాలు ఉండవా? కానీ, ఒక సీక్రెట్ లాంగ్వెజ్ తయారు చేసే తీరిక, పరిశోధన మనకెక్కడిది? అని కొట్టిపారేస్తున్నారా? కానేకాదు.. అతి సామాన్యులే తయారుచేసుకున్న రహస్య భాషలు కూడా ఉన్నాయి.
తెలుగులో ‘క’ భాష కూడా ఆ కోవలోనిదే. 70, 80వ దశకంలో పుట్టిన తెలుగువాళ్లకు ఈ భాష కొట్టినపిండి. ప్రతి అక్షరానికి ముందు ‘క’ తగిలిస్తే అదే ‘క భాష’ అవుతుంది. జంధ్యాల ఓ సినిమాలో పెట్టడంతో దీనికి మరింత ప్రాచుర్యం వచ్చినా.. అంతకుముందే ఈ భాష వినియోగంలో ఉన్నట్లు కొందరు చెప్తుంటారు. మరి తరాలు మారాయి. తాజాగా యంగ్ జనరేషన్ అయిన జెన్ జీ యువత భావ వ్యక్తీకరణ ఎలాంటి భాష ఉపయోగిస్తున్నదో తెలుసా? మొత్తం భాష కాకపోయినా.. పదాలు మాత్రం చాలా కొత్తవి వాడుతున్నది. జీ జనరేషన్ అంటే 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వాళ్ల తరం అని అర్థం. ఈ తరానికి కంప్యూటర్, ఇంటర్నెట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో వీళ్లు కమ్యూనికేషన్ కి ఎక్కువగా కీ వర్డ్స్ వాడుతుంటారు. ఇప్పుడు ఏ పని చేసినా సోషల్ మీడియాలో పోస్టింగ్ చేయడం కామన్ అయ్యింది. అందరిలా మనమూ చేస్తే ప్రత్యేకత ఏముంటుంది? అనుకున్నారో ఏమో కానీ, యంగ్ జనరేషన్ మాత్రం కొత్త కొత్త పదాలు క్రియేట్ చేస్తూ సోషల్ మీడియా వాల్స్ నింపేస్తున్నారు. ఆ పదాలు చాలాసార్లు పెద్దవాళ్లకు అర్థం కాదు. దీంతో ఆ పదాలకు అర్థం ఏమిటా? అని తల్లిదండ్రులు కూడా గూగుల్ చేయాల్సిన పరిస్థితి. ఇంతకీ ఆ జెన్ జీ వర్డ్స్ ఏమిటో తెలుసుకుందామా? -ఎస్పీ హరీశ్
క్యాప్: ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పదానికి అర్థం అబద్ధం. అంటే నిజాన్ని దాచేందుకు చేసే ప్రయత్నాన్ని క్యాప్ అంటారు. అదే సమయంలో ఐ యామ్ నో క్యాప్ అంటే నేను అస్సలు అబద్ధాలు చెప్పను అని అర్థం.
బెట్: యెస్. ఎవరైనా చెప్తున్న విషయాన్ని మీరు పూర్తిస్థాయిలో అంగీకరించడాన్ని బెట్ అంటారు. గ్రూపులో ఒక అంశం గురించి చర్చ జరుగుతున్నప్పుడు కొందరు వ్యతిరేకిస్తారు.. కొందరు మద్దతు ఇస్తారు. కానీ, కొందరు మిగితా అందరినీ ఇన్‌ఫ్లుయెన్స్ చేసేలా బిగ్గరగా మాట్లాడుతూ మద్దతు ఇస్తారు. దీనినే బెట్ అంటారు.
గ్లో అప్: ఏదైనా విషయంలో ఊహించని మార్పు రావడం. ఒక్కసారిగా బరువు తగ్గడం లేదా డ్రెస్సింగ్ స్టైల్ పూర్తిగా మార్చివేసినప్పుడు ఇలా అంటారు. ఒక వ్యక్తిలో వచ్చే ఆకస్మిక మార్పులను ఈ విధంగా ప్రశంసిస్తారు.
హైకీ.. లోకీ: ఫీలింగ్స్. ఏదైనా విషయంపై ఎక్కువ సంతోషంగా ఉండటాన్ని హైకీ అంటారు. వారు ఆ అంశంపై పీక్స్ సంతోషంలో ఉన్నారని అర్థం. అదే సమయంలో బాధగా ఉండటాన్ని లోకీ అంటారు.
చ్యూగీ: ఎవరైనా ట్రెండీగా లేకపోతే వాళ్లను ఇలా పిలుస్తారు. ఎవరైనా మిమ్మల్ని చ్యూ గీ అని పిలుస్తున్నారంటే మీరు స్టైల్ గా, ట్రెండీ లుక్స్ లో కనిపించడం లేదని అర్థం చేసుకోవాలి.
ఫ్యామ్: ఫ్యామిలీ. కుటుంబసభ్యులనుంచి ఫోన్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ కు చెప్పే పదం. ఫ్యామిలీ షార్ట్ కట్‌గా ఫ్యామ్ అయ్యిందన్నమాట.
ఘోస్టింగ్: మీ ఫ్రెండ్ మీ ఫోన్ కాల్ కి రెస్పాండ్ కాకపోయినా.. మీనుంచి దూరంగా ఉంటున్నా.. ఈ పదం వాడుతారు. అంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారని అర్థం.
సింప్: ఎవరిపైనైనా ఎక్కువ శ్రద్ధ చూపించడాన్ని ఇలా అంటారు. ఒక అమ్మాయి అతడిని కేర్ చేయకపోయినా.. అబ్బాయి మాత్రం ఆమె వెనకాలే తిరుగుతూ ఆమెకు అన్ని పనులు చేస్తుంటే పక్కనున్నవాళ్లు అతడిని సింప్ అని అంటారు.
డబ్ల్యు: ఇంగ్లిష్ లో ఉండే 26 అక్షరాల్లో ఇది ఒకటి. కానీ, దీని అర్థం విన్.
సాల్టీ: ఎవరైనా కోపంగా లేదా అసూయతో ఉండటాన్ని సాల్టీ అంటారు.
స్టాన్: ఎక్కడికి వెళ్లినా వెంబడించడం.. సోషల్ మీడియాలో అనుక్షణం ఫాలో కావడాన్ని స్టాన్ అంటారు. అయితే, వారితో ఎలాంటి ప్రమాదం మాత్రం ఉండదు. ఆ వ్యక్తులకు వీరు వీరాభిమానులు. అందుకే ప్రతి అంశంలోనూ వీరి గురించి అతిగా ఆలోచిస్తారు. సాధారణంగా సెలబ్రిటీలకు ఈ తరహా అభిమానులు ఉంటారు.
గోట్: తమిళ్‌లో విజయ్ సినిమా వచ్చాక ఈ పదానికి అర్థం అందరికీ తెలిసిపోయింది. గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఎవరినైనా ప్రశంసించే సందర్భంలో దీనిని వాడుతారు.
స్లాప్స్: ఎవరైనా అద్భుతంగా ఏదైనా చేస్తే ప్రశంసించడాన్ని స్లాప్స్ అంటారు. ఒకరకంగా చప్పట్లను ఇంగ్లిష్ లో క్లాప్స్ అంటారుగా.. అందుకే ఈ జనరేషన్ వాళ్లు ఈ పదాన్ని స్లాప్స్ గా మార్చేశారు.
బిగ్ యైక్స్: అందరిముందు సిగ్గుపోయే లేదా ఇబ్బందిపడిన పరిస్థితి. తన బాస్ కి అనుకోకుండా ఏదైనా తప్పుగా మెసేజ్ పంపారే అనుకోండి.. ఆ పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి సందర్భాలను బిగ్ యైక్స్ అంటారు.
డెలులు: రియాలిటీకి దూరంగా ఉండేవారిని ఇలా పిలుస్తారు. అంటే వారు చెప్పే విషయాలను అన్నీ వాస్తవానికి దూరంగా ఉంటాయి. ఏదైనా అతిగా ఊహించుకోవడం చేస్తే డెలులు అంటారు.
ఫైర్: ఏదైనా అద్భుతం అని చెప్పేందుకు ఈ పదాన్ని వాడుతారు. ఎవరైనా లేటెస్ట్ ట్రెండీ ఔట్ ఫిట్ వేసుకుంటే ఫైర్ ఎమోజీ పెడతారు. అంటే వారి లుక్ అద్భుతంగా ఉందని అర్థం.
వైబ్: పాజిటివ్ నెస్. ఎవరైనా తన మాటలతో అక్కడున్న వారందరినీ నవ్వులతో ముంచెత్తుతూ.. అక్కడున్న వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చివేయడాన్ని వైబ్ అంటారు.
బూజీ: చాలా డబ్బు ఉండి.. లగ్జరీ వస్తువులు వాడుతారో వారిని బూజీ అని పిలుస్తారు. ఒక హోటల్‌లో యాంబియెన్స్ చాలా కాస్ట్లీగా ఉందనుకుంటే ఈ పదం వాడుతారు.
ఏట్: మామూలుగా ఇంగ్లిష్ లో ఏట్ అంటే ఆహారం తినడం అని అర్థం. కానీ, ఇక్కడ పర్ఫార్మెన్స్ చింపేసింది అని అర్థం. అంటే ఎవరైనా మీటింగ్ లేదా స్టేజ్ షోలో ఏదైనాగానీ అద్భుతంగా వ్యవహరించడాన్ని ఏట్ అని అభివర్ణిస్తారు.
బే: బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్‌ను షార్ట్‌కట్‌లో బే అని పిలుస్తారు. గతంలో బేబీ లేదా బేబ్ అని పిలిచేవారు.. ఇప్పుడు ‘బే’తో సరిపెడుతున్నారు.
గ్యాసింగ్: ఎవరినైనా ఎక్కువగా పొగిడినా లేదా సపోర్ట్ చేసినా.. హైప్ ఇచ్చినా దానిని గ్యాసింగ్ అంటారు. అలాంటివారు ఏది చెప్పినా గ్యాసింగ్ అంటూ వెక్కిరిస్తారు.
గివింగ్ మీ లైఫ్: ‘ఆ ఫుడ్ తిని చచ్చిపోవచ్చు.. అంత బాగుంటుంది’ అని అనడం ఈ మధ్య కామన్ అయ్యింది. ఉదయాన్నే కాఫీ తాగితే ప్రాణం లేచొస్తుంది అని అంటాంకదా అలాంటిదే ఈ పదం కూడా. ఏదైనా బాగా ఇష్టపడే ఫుడ్ ని తిన్నప్పుడు ఇలా సోషల్ మీడియాలో కామెంట్ పెట్టడం ఇప్పుడు కామన్ అయ్యింది.
సోషల్ మీడియాలో ట్రెండింగ్ షార్ట్ వర్డ్స్
IRL: IN REAL LIFE
IYKYK: IF YOU KNOW, YOU KNOW
L/W: LOSE/WIN
ASL: AS HELL
BBG: BETTER BE GOING
DL: DOWN LOW
FFA: FREE FOR ALL
FTW: FOR THE WIN
FWB: FRIEND WITH BENEFITS
FYP: FOR YOU PAGE
GG: GOOD GAME
ICYMI: IN CASE YOU MISSED IT
ISO: IN SEARCH OF
KMS: KILL MY SELF
LOL: LAUGH OUT LOUD
LMS: LIKE MY STATUS
NGL: NOT GONNA LIE
NSFW: NOT SAFE FOR WORK
OMW: ON MY WAY
ONG: ON GOD
RN: RIGHT NOW
WYD: WHAT YOU DOING