- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సర్కారు ఆదేశాలు.. బిల్డర్స్ బేఖాతర్
దిశ,న్యూస్‌బ్యూరో: భవన నిర్మాణ కార్మికుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి.. (కొవిడ్ 19) కరోనా వైరస్ నియంత్రణ చర్యలో భాగంగా లాక్‌డౌన్ అమలులో ఉండడంతో. కార్మికుల కడుపు లాక్ వేసినట్లైయింది. వీరి ఆకలి మంటలు ఎవరికి పట్టడం లేవు. తమ శ్రమను దోచుకొని కోట్లు గడించిన యాజమాన్యాలు మాత్రం కంటితుడుపు చర్యలతో మమ అనిపిస్తున్నారు. కార్మికులకు లాక్‌డౌన్ అమలులో ఉన్నన్ని రోజులు అన్ని రకాల వసతులు కల్పించే బాధ్యత ఆయా యాజమాన్యాలదేనని ప్రభుత్వం చెప్పినప్పటికీ బిల్డర్స్, కాంట్రాక్టర్లు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను బేఖాతర్ చేస్తుండడంతో ప్రభుత్వమైన మా కడుపు మంటలు తీర్చాలని వేడుకుంటున్నారు కార్మికులు..
రాష్ట్ర రాజాధాని హైదరాబాద్ మహానగరం రియల్ ఎస్టేట్ రంగం అగ్రభాగంలో దూసుకుపోతుంది. ఇక్కడా వివిధ రంగల సంస్థలు పెట్టుబడులు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ‘మూడుపువ్వులు ఆరు కాయలు’ అన్నట్లు సాగిస్తున్నారు. ఈ నిర్మాణ రంగలో వేలాదిమంది కార్మికులు పనిచేస్తున్నారు. కేవలం హైదరాబాద్‌లో 164 మంది బిల్డర్ల వద్ద 26,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా వివిధ రాష్ట్రాలు ఒరిస్సా, మహారాష్ట్రం, ఛత్తీస్ గడ్, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలోని వివిధ జిల్లాలకు చెందిన కార్మికులు బతుకుదెరువు కోసం పొట్టచేత పట్టుకొని వచ్చి హైదరాబాద్‌లో బిల్డర్ల వద్ద కూలీ పనులు చేస్తున్నారు. అయితే ప్రపంచ దేశాలను గడగడ వణికిస్తున్న కరోనా ఇప్పడు భవన నిర్మాణ కార్మికుల బుతుకులను చిద్రం చేసింది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేయడంతో బిల్డర్లు భవన నిర్మాణ పనులు బంద్ పెట్టారు. కార్మికులు పనిచేస్తేనే కూలీ డబ్బులు ఇస్తారు. వారం రోజుల నుంచి పనులు బంద్ ఉండడంతో కార్మికులకు తినడానికి తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. చిన్న పిల్లల ఆకలి కేకలు ఆ తల్లుల గుండెలను పిండేస్తున్నాయి. కనీసం పిల్లలకు పాల ప్యాకెట్ కొనడానికి కూడా చిల్లి గవ్వలేని దీనమైన స్థితికి భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల బతులకు దిగజారాయి. తమ శ్రమను దోచుకొని సొమ్ము చేసుకుంటున్న బిల్డర్స్,కాంట్రాక్టర్లకు మాత్రం వారి ఆకలి కేకలు వినిపించడం లేవు. ఇంటికి పోవాలంటే బిల్డర్ వద్ద తీసుకున్న అడ్వాన్స్ చెల్లించాలి. పూటగడుపు కోవడానికే డబ్బులు లేవు. ఇకా అడ్వాన్స్ ఏడా చెల్లిద్దుమని ‘‘సావో బతుకో’’ ఇక్కడే ఉంటమని మొండిగా ఒక పూటతిని మరో పూట పస్తులు ఉంటూ కాలం వెల్లబుచ్చుతున్నారు.
భవన నిర్మాణ కార్మికుల కష్ట, సుఖాలు చూసుకుని.. వారు అనారోగ్యం బారిన పడకుండా కరోనా వైరస్ పై అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీదేనని ప్రభుత్వం జీహెచ్ఎంసీ అధికారులకు, బిల్డర్స్, కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. కానీ, బిల్డర్స్, కాంట్రాక్టర్లు మాత్రం అవీ మా ప్రమణాలు కావు.. బతికుంటే పనిచేయించు కుంటాం.. లేకపోతే లేదు అన్నట్లు వ్యహరిస్తున్న తీరు.. సైట్ల వద్ద కార్మికులు పడతున్నబాధలు కండ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. ఒక్కో బిల్డర్ వద్ద కార్మికుల సుమారు 400 నుంచి 1000 మంది వరకు పనిచేస్తున్నారు. సైట్ వద్ద ఉన్న చిన్న చిన్న రేకుల షెడ్లే వారి ఆవాసాలు. ఒక్కోషెడ్‌లో 10 నుంచి 20 మంది ఉంటున్నారు. దేశం మొత్తం కరోనా వైరస్ మహమ్మారితో వణికిపోతూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు. ఒకరికి ఒకరు మీటర్ దూరంలో ఉండాలని ప్రభుత్వం పెద్ద ఎత్తున్న ప్రచారం చేస్తున్నది. అలా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీచేసింది. కానీ, భవన నిర్మాణ కార్మికుల అలాంటి అవకాశం లేదు. తక్కువల తక్కువగా 350నుంచి 800మంది వరకు ఒకే దగ్గర ఉంటున్నారు. వీరికి అక్కడా వసతులు కూడా అంతంత మాత్రమే. ప్రసుత పరిస్థిలో వ్యక్తిగత శుభ్రత చాలా అవసరం. హైదరాబాద్ లోని మోదీ బిల్డర్ హయత్‌నగర్ సైట్ వద్ద ఉన్న 400 కార్మికులకు 20 షెడ్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ బాత్ రూములు సరిపడా లేక కార్మికులు నానా యాతన పడుతున్నారు. వ్యక్తిగత శుభ్రత మాటకు వస్తే. స్నానం చేయడానికి సరిపడా బాత్ రూమ్‌లు లేకపోవడంతో వంతులవారీగా స్నానాలు చేస్తున్నారు. ఒకరోజు ఒక బ్యాచ్ స్నానం చేస్తే మరో రోజు ఇంకో బ్యాచ్ స్నానలు చేయాల్సిన పరిస్థి నెలకొంది. ఇకా ఎల్బీనగర్‌లోని శ్రీ వాసవి శ్రీనివాస్ బిల్డర్ వద్ద పనిచేస్తున్న 800మంది కార్మికులకు సరిపడా వసతులు లేక నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌లో తలదాచుకుంటున్నారు. ఇలా హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌తో వేలాదిమంది కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. కష్ట కాలంలో ఉన్న మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కార్మికులు కోరుతున్నారు.
మా పిల్లలకు పాలు కొందామన్న డబ్బులు లేవు: బొలియ బాయి భవన నిర్మాణ కూలీ, ఛత్తీస్‌గడ్
నాలుగేండ్లుగా ఇక్కడ పనిచేస్తున్న. ఎన్నడూ ఇలాంటి ఇబ్బంది రాలేదు. పది రోజుల నుంచి పని బంద్ ఉంది. చేతిల రూపాయ లేదు. పిల్లలకు పాలు లేక ఏడుస్తున్నారు. మేం ఒకపూట తింటున్నం, మరో పూట పస్తులుంటున్నం. మా శేట్ పనిచేస్తేనే డబ్బుల ఇస్తాడు. పనులు లేవు డబ్బులు, బియం లేవు తెలంగాణ సర్కారు మమ్మల్ని కాపాడాలి.
ప్రభుత్వం మాకు సహాయం చేయాలి : శ్రీరాములు కూలీ, మహుబూబాబాద్
నేను ఇరవైయేండ్ల నుంచి మెస్త్రీగా పనిచేస్తున్నా. పనిచేస్తేనే ఆ రోజు పూటగడుస్తుంది. అలాంటిది పది రోజుల నుంచి మా యజమాని పనులు బంద్ పెట్టారు. ఏ రోజు ఆ రోజు అన్నట్లు మా జీవనం సాగుతుంది. పని లేక చేతుల డబ్బులు లేవు. ప్రభుత్వమెమే కార్మికుల బాగోగులు యజమానులు చూసుకోవాలంటుంది. పనిచేస్తే డబ్బులు ఇచ్చేది కష్టం పనులు లేకుండా డబ్బలు ఇవ్వడమంటే అవన్ని ఉత్తిమాటలే.. మాట వరుసకు కుటుంబానికి రూ.1000 ఇచ్చారు. అవి కూడా పనిలో పట్టుకుంటరంటున్నారు. మా కుటుంబంలో ఐదుగురం ఉన్నా అవి బియానికి కూడా సరిపోలేదు. కూరగాయలకు డబ్బులు లేక కారం వేసుకొని తింటున్నం. ప్రభుత్వం మా బాధలు అర్థం చేసుకొని మాకు సహాయం చేయాలి.
tags : building workers, coronavirus,Builders