- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ సారి ప్రత్యేక ఏర్పాట్లు….
దిశ వెబ్ డెస్క్: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈనెల 7 నుంచి జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ సారి సమావేశాల నిర్వహణకు ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలోని అన్ని ఎంట్రన్స్ ల వద్ద థర్మల్ స్క్రీనింగ్ మెషిన్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. స్క్రీనింగ్ టెస్టులు చేశాకే సభ్యులను లోపలికి అనుమతిస్తామన్నారు. ఇక సభ్యులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. సభ్యుల్లో ఎవరికైనా జ్వరం ఉన్నట్టు అనిపిస్తే అసెంబ్లీ ప్రాంగణలోకి రావద్దన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, మీడియా ప్రతినిధులు, అధికారులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనా పాజిటివ్ అని అనుమానం వస్తే అసెంబ్లీ ప్రాంగణంలోకి రావద్దని కోరారు. ఈ సారి ఎమ్మెల్యేల పీఏలను కూడా అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించడం లేదని అన్నారు. సమావేశాల నిర్వాహణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించినట్టు తెలిపారు.