సభ్యులు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి: ఓం బిర్లా

by Shamantha N |
సభ్యులు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి: ఓం బిర్లా
X

దిశ,వెబ్‌డెస్క్: కోవిడ్ నిబంధనల మేరకు సీటింగ్ ఏర్పాట్లు చేశామని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ఎంపీలు, వారి కుటుంబ సభ్యులందరూ కోవిడ్ టెస్ట్ చేసుకోవాలని సూచించారు. పార్లమెంట్ క్యాంటీన్‌ను ఐటీడీసీ నిర్వహిస్తుందని చెప్పారు. క్యాంటీన్ సబ్సిడీలను పూర్తిగా ఎత్తి వేస్తున్నామని చెప్పారు. ప్రశ్నోత్తరాలకు గంట సమయం కేటాయిస్తామని తెలిపారు. సమావేశాలకన్నా ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. సభలో చర్చించే అంశాలపై బీఏసీలో నిర్ణయిస్తామని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed