- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
China: మా ప్రయోజనాలకు హాని కలిగిస్తే ఊరుకోము.. ఆ దేశాలకు చైనా వార్నింగ్

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా, చైనా (America, china) ల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చైనా కీలక ప్రకటన చేసింది. అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకునే దేశాలకు వార్నింగ్ ఇచ్చింది. చైనా ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఏ దేశమైనా అగ్రిమెంట్ కుదుర్చుకుంటే దానిని తీవ్రంగా పరిగణించి ప్రతీకార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. చైనా ప్రయోజనాలకు హాని కలిగించే విధంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్న దేశాలను తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఇతరుల ప్రయోజనాలను పణంగా పెట్టడం సరికాదని పేర్కొన్నారు.
ఈ తరహా పరిస్థితి ఏర్పడితే చైనా దానికి ఎప్పటికీ అంగీకరించబోదని స్పష్టం చేశారు. చైనా తన సొంత హక్కులను కాపాడుకోవడానికి దృఢ నిశ్చయంతో ఉందని, ఇతరులతో కలిసి సంఘీభావాన్ని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలను ప్రకటించినప్పటి నుంచి అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. చైనాపై ట్రంప్ భారీగా సుంకాలను విధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చైనా పై విధంగా స్పందించడం హాట్ టాపిక్ గా మారింది.