అన్నార్థుల ఆకలి తీరుస్తున్న దక్షిణమధ్య రైల్వే

by Shyam |
అన్నార్థుల ఆకలి తీరుస్తున్న దక్షిణమధ్య రైల్వే
X

కరోనా వైరస్ కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఒక్కసారిగా అన్నీ మూసివేయడంతో వలస కూలీలు, పేదలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇలాంటి వారికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు కృషిచేస్తున్నాయి. అన్నార్థుల ఆకలి తీరుస్తున్నాయి. ఇందులో దక్షిణ మధ్య రైల్వే కూడా భాగస్వామ్యమైంది. విజయవాడ, సికింద్రాబాద్, హైదరాబాద్, గుంతకల్లు, గుంటూరు, నాందేడ్ డివిజన్ల పరిధిలో భోజనం తయారు చేయించి వలస, దినసరి కూలీలు, పారిశుద్ధ్య కార్మికులకు, రైల్వే లైసెన్స్‌డ్ పోర్టర్లకు పంపిణీ చేస్తోంది. ఆహార తయారీలో ఎస్ అండ్ టీ, ఇంజినీరింగ్, కమర్షియల్, స్టోర్స్ విభాగాలతోపాటు లాలాగూడ వర్క్‌షాప్ ఉద్యోగులు భాగస్వాములయ్యారు. గత 19 రోజులుగా దాదాపు 1.50 లక్షలకు పైగా ఆహార పొట్లాలను పంపిణీ చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మూల్య తెలిపారు.

Tags: SC Railway, lockdown, outbreak, food distribution,

Advertisement

Next Story

Most Viewed