- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గరిటె తిప్పిన సోనూసూద్..

X
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ టైంలో సోనూసూద్.. రియల్ హీరోగా ఏ విధంగా సేవలందించారో తెలిసిందే. పాండమిక్ సమయంలో ఎంతోమంది వలస కూలీలను ఆదుకుని భేష్ అనిపించుకున్నారు. ఆపదలో ఉన్నామంటే చాలు ఆదుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే సోను.. మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.
హైదరాబాద్, బేగంపేటలో అనిల్ అనే యువకుడు.. సోను స్ఫూర్తితో ‘లక్ష్మీ సోనూసూద్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్’ను నిర్వహిస్తున్నాడు. కాగా కొవిడ్ కష్టకాలంలో తన చైనీస్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ను తొలగించి, పూర్తిగా హైదరాబాదీ స్టైల్‌లో ఫుడ్ కోర్టు నిర్వహిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సోను.. తాజాగా ఆ ఫుడ్ కోర్టును సందర్శించాడు. ఈ సందర్భంగా తనే స్వయంగా ఎగ్ ఫ్రైడ్‌రైస్‌ను తయారు చేసుకొని తినడం విశేషం.
Next Story