- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిరు సినిమాలో సోనూసూద్‌కు సన్మానం
దిశ, వెబ్‌డెస్క్ : రీల్ విలన్.. రియల్ హీరో సోనూసూద్‌ను ‘ఆచార్య’ మూవీ సెట్స్‌లో ఘనంగా సన్మానించారు. లాక్‌డౌన్ టైమ్‌లో అనేక మంది వలస కూలీలను, విద్యార్థులను సోను ఆదుకున్న సంగతి తెలిసిందే. తనను సాయం కోరిన ప్రతి ఒక్కరినీ ఆయన దేవుడిలా ఆదుకున్నాడనడంలో అతిశయోక్తి లేదు. కాగా సోను ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఈ చిత్ర షూటింగ్ ఈ మధ్యే ప్రారంభించగా, సోనూసూద్ కూడా పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌లో తను చేసిన సేవలకు గాను దర్శకుడు కొరటాల శివ, నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి సెట్‌లోనే ఆయనను ప్రత్యేకంగా సన్మానించి, పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాన్ని బహూకరించారు. కార్యక్రమంలో ఆచార్య టీమ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సోను.. ముంబై కంటే దక్షిణాది సినిమాల్లో నటించేటప్పుడే తనకు ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుందని, ఇక్కడి ప్రేక్షకులు అందించే ప్రేమను మాటల్లో చెప్పలేనని తెలిపారు.