- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్ళీ సాయానికి ముందుకొచ్చిన సోనూసూద్
దిశ, వెబ్ డెస్క్: కష్టం ఎక్కడ ఉంటే సోనూసూద్ అక్కడ సోనూసూద్ వాలిపోతున్నాడు. ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకుంటూ మానవత్వాన్ని చాటుతున్నాడు. ఈ క్రమంలో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తేజశ్రీ (12) అమ్మాయికి అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు సోనూ. మొయినాబాద్ మండలంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో గత నాలుగు రోజులుగా సోనూసూద్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్నారు నగరంలోని హాఫిజ్‌పేటకు చెందిన మారయ్య సరస్వతి దంపతులు. వెంటనే తమ కూతురు తేజశ్రీని వెంటబెట్టుకొని సోనూసూద్‌ను కలిశారు.
పుట్టినప్పటి నుండి గుండె సంబంధిత వ్యాధితో తమ కూతురు బాధపడుతుందని అప్పటి నుండి చికిత్స చేయిస్తూ మందులు వాడుతున్నామని సోనూసూద్ వద్ద తమ గోడును వెళ్లబోసుకున్నారు. నెలకు 20వేల రూపాయలు మందుల కోసమే వెచ్చిస్తున్నామని ఇప్పుడు మందులు తీసుకోవడానికి కూడా డబ్బులు లేవని తమ కష్టాన్ని వినిపించారు. దీంతో చలించిపోయిన సోనూసూద్ తేజశ్రీ మందుల కోసం అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని హామీ ఇచ్చారు. బాలికకు గుండె మార్పిడి ఆపరేషన్ తప్పనిసరి అయితే వైద్య ఖర్చులు కూడా తానే భరిస్తానని భరోసా ఇచ్చి.. తన మంచి మనసును చాటుకున్నాడు.