- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైనాకు సాయం చేసిన సోనూ సూద్
దిశ, స్పోర్ట్స్: కరోనా తీవ్ర రూపం దాల్చడంతో ఆసుపత్రుల్లో రోగులు క్యూలు కడుతున్నారు. ఎంత రికమెండేషన్లు చేసినా బెడ్లు దొరకడం లేదు. మరోవైపు బెడ్లు దొరికినా పేషెంట్లకు సరిపడా ఆక్సిజన్ లభించడం లేదు. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనాబంధువుకు ఆక్సిజన్ కావల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఉంటున్న ఆ వ్యక్తి కోసం ఆక్సిజన్ కావాలంటూ రైనా ట్విట్టర్ వేదికగా ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను అభ్యర్థించాడు. కానీ సీఎం యోగి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. చావుబతుకుల్లో ఉన్న రైనా బంధువుకు ఆక్సిజన్ ఇవ్వడానికి బాలీవుడ్ నటుడు సోనూసూద్ ముందుకు వచ్చాడు. రైనా అభ్యర్థనకు స్పందించి 10 నిమిషాల్లో నీకు ఆక్సిజన్ సిలిండర్ వస్తుందని రీట్వీట్ చేశాడు. సోనూ చేసిన సాయానికి రైనా ట్విట్టర్ సాక్షిగా కృతజ్ఞతలు తెలిపాడు. గత ఏడాది లాక్‌డౌన్ సమయం నుంచి సోనూ సూద్ ఎంతో మందికి సాయం చేస్తూ వస్తున్నాడు.