- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వలస కార్మికుల కోసం యాప్ తెచ్చిన సోనూ
లాక్‌డౌన్ కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న వలస కార్మికులకు సోనూసూద్ అండగా నిలిచిన విషయం తెలిసిందే. తమ సొంతూళ్లకు వెళ్లేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. అటు ముంబై పోలీసులకు కూడా ఫేస్ షీల్డ్స్, మాస్క్‌లు అందించి తన గొప్ప మనసును చాటుకున్నాడు. విరాళాల రూపంలోనూ తనకు తోచినంత సాయం చేసిన సోనూ.. అందరితో బంగారం అనిపించుకున్నాడు. అయితే వలస జీవుల కష్టాలను స్వయంగా చూసిన సోనూ.. వారిపై ఓ బుక్ కూడా తీసుకురాబోతున్నాడు. కానీ ఇవన్నీ తాత్కాలికం. వారి కష్టాలకు ఓ శాశ్వత పరిష్కారం చూపాలనుకున్నాడు. అందుకే ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వలసదారులకు సహాయం చేయడానికి తాజాగా ఓ యాప్‌ను లాంచ్ చేశాడు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లోని ఉద్యోగ అవకాశాలను సంబంధించిన సమాచారాన్ని కార్మికులకు అందించేలా రూపొందించిన ‘ప్రవాసీ రోజ్‌గార్’ యాప్‌ను సోనూసూద్ బుధవారం ఆవిష్కరించారు. యాప్‌లో ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు సరైన ఉద్యోగాలు వెతుక్కునేందుకు తోడ్పడేలా డిజైన్ చేశారు.