సోమనాథ్ ఆలయం మూసివేత

by Shamantha N |
సోమనాథ్ ఆలయం మూసివేత
X

గాంధీనగర్: గుజరాత్‌లో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం సోమనాథ్ ఆలయాన్ని మూసి వేస్తున్నట్టు ఆలయ ట్రస్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆలయాన్ని నేటి నుంచి నిరవధికంగా మూసివేస్తున్నట్టు అధికారులు చెప్పారు. దీంతో పాటు ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే పలు ఆలయాలను కూడా మూసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆలయ సోషల్ మీడియా పేజీలో హారతి సేవలను భక్తులు వీక్షించవచ్చని తెలిపారు.

Advertisement

Next Story