- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రేమ పేరిట సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మోసం
X
దిశ, క్రైమ్‌బ్యూరో: ప్రేమ పేరుతో బంధువుల యువతిని పెళ్లి చేసుకుని, ఆ పై ఇంట్లో పెద్దలు వద్దంటున్నారంటూ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మోసం చేసిన ఘటన రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగింది. చంపాపేట నాగార్జున కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్ శ్రీపురం పవన్.. కర్మన్‌ఘాట్‌కు చెందిన బంధువుల యువతిని ప్రేమ పేరుతో నమ్మించాడు. పెళ్ళి చేసుకుంటానని నమ్మించడంతో వారిద్దరూ 2015 నుంచి సన్నిహితంగా మెలిగారు. 2017లో బెంగుళూరులో తీసుకెళ్లి మెడలో తాళి కట్టాడు. ఆ సమయలో హనీమూన్ పేరుతో ఊటీలో మూడ్రోజులు తిరిగి నగరానికి వచ్చాక.. మా కుటుంబ పెద్దలు పెళ్ళికి అంగీకరించడం లేదంటూ ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు సరూర్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న సరూర్ నగర్ పోలీసులు పవన్‌ను బుధవారం అరెస్టు చేసి రిమాండ్ చేశారు.
Advertisement
Next Story